Begin typing your search above and press return to search.
చరణ్ తారక్ పై మరోసారి తనకున్న ఇష్టంను చూపించిన మహేష్
By: Tupaki Desk | 18 Feb 2020 1:18 PM GMTటాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ బాబు.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ముగ్గురు పలు అకేషన్స్ లో కలవడం.. కలిసి ఫొటోలకు ఫోజ్ లు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ హీరోల్లో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటూ గతంలో మహేష్ బాబును అడగగా ఎన్టీఆర్.. చరణ్ పేర్లు చెప్పాడు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్.. చరణ్ పై తనకున్న ఇష్టంను మహేష్ బాబు చెప్పకనే చెప్పాడు.
తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు. ఆ ఇంటర్వ్యూలో రాజకీయాలపై ఇష్టం లేదన్న మహేష్ బాబు మరో ప్రశ్నకు సమాధానంగా రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు తనకు ఇష్టం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక ఇండస్ట్రీకి చెందిన హీరోల్లో మీరు ఎవరితో రోడ్డు డ్రైవ్ వెళ్లాలని అనుకుంటున్నారు అంటూ ఇంటర్వ్యూవర్ ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు మహేష్ బాబు ఆసక్తికర సమాధానం చెప్పాడు. మరో డౌట్ లేకుండా చరణ్.. తారక్ లతో తాను రోడ్డు డ్రైవ్ కు వెళ్తాను అన్నాడు. అదే సమయంలో టీం ను బ్యాలన్స్ చేసేందుకు చిరంజీవి గారిని కూడా తీసుకు వెళ్తామంటూ నవ్వేశాడు. మొత్తానికి చరణ్ మరియు తారక్ లు తనకు గట్టి పోటీ ఇస్తున్నా.. వారి ఫ్యాన్స్ తనను ఎంతగా ట్రోల్ చేసినా కూడా వారితో మాత్రం మంచి స్నేహంను మహేష్ కంటిన్యూ చేయడం నిజంగా అభినందనీయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.