Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో: మహేష్ బాబు డైలాగ్‌ను పేల్చిన మహ్మద్ కైఫ్
By: Tupaki Desk | 9 Sept 2021 5:00 PM ISTబాహుబలి దెబ్బకు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ హద్దులు చెరిగిపోయాయి. బాలీవుడ్ కు, హాలీవుడ్ స్థాయికి మన సినిమాలు వెళ్లిపోతున్నాయి. తెలుగు హీరోల గురించి దేశమంతా తెలుసుకుంటోంది. ఇప్పటికే ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోగా.. అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ లు క్యూలో ఉన్నారు.
మన మాజీ క్రికెటర్లకు తెలుగు హీరోల గురించి బాగా తెలుసు. కొందరు తమ ఇంటర్వ్యూలలో తెలుగు హీరోల సినిమా డైలాగ్‌లను పలుకుతూ తెలుగు సినిమా పట్ల ప్రేమను కురిపిస్తున్నారు. ఇటీవల గబ్బర్ సింగ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను వీరేంద్ర సెహ్వాగ్ అనుకరించడాన్ని మనం చూశాము. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇప్పుడు మరో మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తెలుగు డైలాగ్ తో వార్తల్లో నిలిచాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ డైలాగ్‌ను అనుకరించి ఆకట్టుకున్నాడు. ఈగిల్ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ దూకుడు సినిమాలోని ‘మైండ్ లో ఫిక్స్ ఐతే బ్లైండ్ గా వెళ్లిపోతా’ అనే ప్రముఖ డైలాగ్ ను పలికాడు. డైలాగ్‌ని పలికేటప్పుడు కైఫ్ స్వాగ్‌ని తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయినా కూడా పవన్ లాగానే మేనరిజం ప్రదర్శిస్తూ పలికేశాడు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
భారతదేశంలోని ప్రముఖ క్రికెటర్లలో మహ్మద్ కైఫ్ ఒకరు. ఈయన తమ అభిమాన హీరో సంభాషణను పలకడాన్ని చూసి మహేష్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. దాన్నిప్పుడు వైరల్ చేస్తున్నారు.
కెరీర్ పరంగా చూస్తే మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.