Begin typing your search above and press return to search.

మహేష్‌ కూతురు సందడి చూశారా!!

By:  Tupaki Desk   |   12 March 2018 11:11 AM IST
మహేష్‌ కూతురు సందడి చూశారా!!
X
సినిమా హీరోయిన్లను అభిమానించే వారి సంఖ్య.. లక్షల్లో కోట్లల్లో ఉంటుంది. అంతగా తమ అందంతో అందరినీ కట్టిపడేస్తుంటారు. అయితే.. ఎంతటి అందగత్తెలు అయినా.. వీరు కూడా కొందరిని ఇష్టపడుతూ ఉంటారు. తమ అభిమానాన్ని ఇష్టాన్ని చూపుతూ ఉంటారు. కానీ ఒకే అమ్మాయిని అందరూ ఇష్టపడడం అంటే చెప్పుకోవాల్సిన విషయమే. మహేష్ బాబు ఎంతటి ఫ్యామిలీ పర్సన్ అనే సంగతి తెలిసిందే.

పర్సనల్ తో ప్రొఫెషన్ ను ముడిపెట్టడు కానీ.. ప్రొఫెషన్ కి ఫ్యామిలీకి బాగానే లింక్ చేస్తుంటాడు. తన పిల్లలను షూటింగ్ స్పాట్ కు తీసుకొచ్చేందుకు ఏమాత్రం సందేహించడు. ఇప్పుడు మహేష్ తో కలిసి భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ కైరా అద్వానీ. మహేష్ బాబు కూతురు సితారతో కలిసి ఈ భామ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతలోనే ఈ చిన్నారితో ఎంతగా కలిసిపోయిందో అర్ధమవుతుంది. మహేష్ సినిమాల్లో నటించే హీరోయిన్లు.. ఇలా సితారకు ఫ్రెండ్స్ అయిపోవడం చూస్తూనే ఉంటాం.

గతంలో సమంత కూడా ఇలాగే మహేష్‌ కూతురితో తెగ ఇంటరాక్ట్ అయ్యింది.. ఆ సరదాల్లో కొన్నింటిని నెట్ లో కూడా పెట్టింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో కైరా అద్వానీ కూడా చేరింది. సినిమా హీరోయిన్స్ ను కూడా తనను తెగ అభిమానించేలా చేసేస్తోంది సితార. మరి ముద్దులొలికే చిన్నారి.. అందులోనూ మహేష్ బాబు కూతురు అంటే ఆమాత్రం ముద్దు చేయడం సహజమే.