Begin typing your search above and press return to search.

నెట్టింట ట్రెండ్ అవుతున్న సెలబ్రిటీ కిడ్స్..!!

By:  Tupaki Desk   |   26 Dec 2020 4:00 PM IST
నెట్టింట ట్రెండ్ అవుతున్న సెలబ్రిటీ కిడ్స్..!!
X
ఇండస్ట్రీ సినీతారల పిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు. వాళ్ళు చేసే అల్లరి ఇంటి వరకే పరిమితం అయ్యుండదు. ఇంట్లో మొదలు పెట్టిన అల్లరి పోస్టుల రూపంలో సోషల్ మీడియాలో పెడుతుంటారు సెలబ్రిటీలు. మాములు టైంలోనే తెగ అల్లరి చేసే హీరో హీరోయిన్ల పిల్లలు.. అదే ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అంటే ఊరుకుంటారా.. అలా చేసే పిలల్లో ముందుంటారు అల్లు అయాన్, అల్లు ఆరా. వీరిద్దరూ సినీ హీరో అల్లు అర్జున్ పిల్లలు. మనకు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వీళ్ళ అల్లరి వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. అల్లు అయాన్ కంటే కూడా ఆరా చాలా అల్లరి పిల్ల అని అర్ధమవుతుంది. తన తండ్రి బన్నీ నటించే సినిమాలలోని డైలాగ్స్, యాక్టింగ్ చేస్తూ కెమెరా కంట్లో పడుతోంది. ఈ ఇద్దరు అన్నచెల్లెళ్లకు నెట్టింట ఫాలోయింగ్ మాములుగా లేదు. తాజాగా ఇద్దరు కలిసి క్రిస్మస్ ఫెస్టివల్ సందర్బంగా దిగిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె అల్లరి గురించి అందరికి తెలిసిందే. ఎల్లప్పుడూ ఎంతో హుషారుగా ఉంటూ అల్లరి చేస్తుంది సితార. నిజంగా సితారకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. హీరోలలో తండ్రి మహేష్ బాబు క్రేజ్ టాప్ లో ఉంటుంది. ఇక సెలబ్రిటీల పిల్లల విషయానికి వస్తే సూపర్ స్టార్ కూతురు సితార క్రేజ్ టాప్ లో ఉంటుంది. ఎందుకంటే మాటలతోనే బూరెలు వండేసే రకం సితార. గలగల మాట్లాడుతూనే ఉంటుంది. ఎల్లప్పుడూ తండ్రితో అల్లరి చేస్తూ ఉండే సితూ పాప.. తాజాగా క్రిస్మస్ సాంటా డ్రెస్ లో నవ్వుతూ మెరిసింది. ప్రస్తుతం ఆ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మొత్తానికి క్రిస్మస్ సందడిని సెలబ్రిటీల పిల్లలు వారిళ్లలో తీసుకొచ్చేసారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.