Begin typing your search above and press return to search.

వీడియో: సిత పాప సర్.. సిత పాప అంతే!

By:  Tupaki Desk   |   3 Jun 2020 12:20 PM IST
వీడియో: సిత పాప సర్.. సిత పాప అంతే!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార పాపకు సోషల్ మీడియాలో భారీగా అభిమానులు ఉన్నారు. అభిమానులు అంటే మహేష్ అభిమానులు మాత్రమె కాదు.. సాధారణ నెటిజన్లు కూడా సితార పాప క్యూట్ నెస్ కు అల్లరికి ఫిదా కాక తప్పదు. ఇప్పటికే ఎన్నోసార్లు తన వీడియోలతో అందరినీ మెప్పించిన సితార మరోసారి ఆలానే చేసి మహేష్ గారి కూతురు అనిపించింది.

మహేష్ సతీమణి నమ్రత తన ఇన్స్టా ఖాతా ద్వారా వీడియో ను పోస్ట్ చేస్తూ "ఈఫిల్ టవర్ ఎదురుగా ఉన్న హోటల్ రూమ్ లో ఉన్నప్పటికీ తన డాన్స్ ప్రాక్టీస్ మాత్రం ఆగడం లేదు" అంటూ కాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో సితార పాప తజ్జుమ్ తకజుం అంటూ ఓ ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ తరహాలో నాట్యం చేసింది. ఇప్పుడే ఇలా డాన్స్ చేస్తే భవిష్యత్తులో కూచిపూడి.. భారత నాట్యం.. కథకళి.. పేరిణి అన్నిటిని అవలీలగా చేసేస్తుందేమో. వాటితో పాటు గా నాన్నగారు చేసే స్టెప్పులను అవలీలగా అనుకరించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే సితార పాప... సాదరణమైన పాప కాదు. ఓ సూపర్ స్టార్ మనవరాలు.. మరో సూపర్ స్టార్ కూతురు!

ఈ వీడియోకు ఇన్స్టా లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రెండున్నర లక్షల లైక్స్ కొట్టారు. క్యూటీ.. స్వీటీ.. అంటూ చాలామంది సితార పాపను ముద్దుగా పిలిచారు. ఆలస్యం ఎందుకు.. వెంటనే అ నాట్యం చూసేయండి.