Begin typing your search above and press return to search.

అమ్మ నాన్న.. మధ్యలో ప్రిన్సెస్ సితార

By:  Tupaki Desk   |   22 July 2016 1:14 AM GMT
అమ్మ నాన్న.. మధ్యలో ప్రిన్సెస్ సితార
X
టాలీవుడ్ కి ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. మరి మహేష్ ఇప్పుడు ఆల్మోస్ట్ టాలీవుడ్ కి రారాజు రేంజ్ లోకి వెళ్లిపోయాడు. తన ప్రిన్సెస్ కి మూడో బర్త్ డే సెలబ్రేట్ చేశాడు. ఆ బుల్లి యువరాణి ఎవరో కాదు.. మహేష్ కూతురు సితార. 20 జూలై 2012న మహేష్ బాబుకు కూతురు పుట్టగా.. ఇప్పుడు తమ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది మహేష్ వైఫ్ నమ్రత.

సితార బర్త్ డే తర్వాత రోజున ఓ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది నమ్రత. అందులో బబుల్స్ తో ఆడుకుంటున్న సితార కనిపిస్తుంది. ఇప్పుడైతే.. భర్త మహేష్ కో కలిసి కూతురుని పట్టుకుని.. సితారతో కేక్ కట్ చేయించిన ఫోటోను రెండు రోజులు లేటుగా అయినా నెట్ లో షేర్ చేసింది నమ్రత. అట్మాస్ఫియర్ చూస్తే.. వాళ్లింట్లోనే ఈ సెలబ్రేషన్ అనే విషయం అర్ధమవుతోంది. అది కాకుండా.. మరిన్ని ఫోటోలు అభిమానులతో పంచుకుంది మహేష్ వైఫ్. వేరే డ్రస్ లో వేరే ప్లేస్ లో సరదాగా గడుపుతున్న పిక్స్ అవి.

అయితే.. అమ్మానాన్న కలిసి కూతురుతో కేక్ కట్ చేయిస్తున్న ఫోటో సంథింగ్ స్పెషల్ అనాల్సిందే. చక్కగా కూతురుని పొదివిపట్టుకుని ఎంతో జాగ్రత్తగా కేక్ కటింగ్ చేయిస్తున్న ఈ జంట.. ఆ కేక్.. ముద్దులొలికే చిన్నారి.. ఫోటో కేక అంతే.