Begin typing your search above and press return to search.

మహేష్ గారాల పట్టి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిందిగా..!

By:  Tupaki Desk   |   24 Dec 2020 10:13 AM IST
మహేష్ గారాల పట్టి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిందిగా..!
X
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు.. నమత్ర శిరోద్కర్‌ల గారాల పట్టి సితార అప్పుడే బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగిపోయింది. ఓ 3డీ యానిమేషన్‌ వెబ్‌సిరీస్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది సితార. ఈ వెబ్‌సిరీస్‌ పోస్టర్‌ను బుధవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఘనంగా ఆవిష్కరించారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణకు మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్‌, బాలీవుడ్‌ నటి నేహా ధూపియా, తెలంగాణ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సితార మాట్లాడుతూ.. బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఈ యానిమేషన్ వెబ్ సిరీస్ పేరు ‘ఫంటాస్టిక్ తార’ ఈ సిరీస్‌ మొదటి సీజన్‌ ఏప్రిల్‌లో విడుదల చేయనున్నామని నిర్మాతలు నయన్‌, మనీష్‌, డైరెక్టర్‌ రాజేంద్ర తెలిపారు.

కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న తర్వాత వస్తున్న సినిమా కావడం.. ‘గీత గోవిందం’తో ఇండస్ట్రీని ఆకట్టుకున్న పరశురామ్ డైరెక్టర్ కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో.. మహేశ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను మెప్పించేలా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట పరశురామ్. ఇటీవల మహేశ్ నుంచి వస్తున్న సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక కోణాలను టచ్ చేయబోతున్నాడట డైరెక్టర్.