Begin typing your search above and press return to search.

బయ్యర్స్ కోసం మహేష్ న్యూ ప్లాన్

By:  Tupaki Desk   |   24 Jan 2018 5:25 PM IST
బయ్యర్స్ కోసం మహేష్ న్యూ ప్లాన్
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ప్రపంచంలో కష్ట సుఖాలను బాగా అలవాటు చేసుకున్నాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా కష్టపడుతున్నాడు. అయితే ఈ మధ్య వరుస పరాజయాలను చూస్తోన్న మహేష్ భరత్ అనే నేను సినిమాతో మళ్లీ రికవర్ అవ్వాలని అనుకుంటున్నాడు. అంతే కాకుండా తన సినిమాల వల్ల నష్టాలను చుసిన బయ్యర్స్ ని ఈ సినిమా ద్వారా ఆదుకోవాలని అనుకుంటున్నాడు.

స్పైడర్ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే బయ్యర్స్ నష్టాలను రికవర్ చేసేందుకు కొరటాల ప్రాజెక్ట్ మార్కెట్ ను వాడుతున్నాడు. ఆ సినిమా పంపిణి హక్కులను స్పైడర్ బయ్యర్స్ కి మినిమమ్ రేట్స్ కి అమ్మెందుకు నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు. ఎక్కువగా సమయం తీసుకోకుండా ఆ మ్యాటర్ ని రెండు మూడు రోజుల్లో క్లోజ్ చెయ్యాలని సూపర్ స్టార్ ఆలోచిస్తున్నారట. వీలైనంత వరకు ఈ సినిమాతో కవర్ చేసి నెక్స్ట్ తన 25వ సినిమాతో కూడా పంపిణీదారులకు అండగా నిలబడాలని మహేష్ ఆలోచిస్తున్నాడు.

అయితే ఎక్కువగా నైజం హక్కులను దక్కించుకున్న దిల్ రాజు భారీ నష్టాలను చూశారు. అయితే 25వ సినిమా ఆయన ప్రొడక్షన్ లోనే కాబట్టి లాభాలను బట్టి రెమ్యునరేషన్ లో కొన్ని మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. మహేష్ ఆలోచన విధానం సేమ్ టూ సేమ్ తన తండ్రి కృష్ణ గారి లానే ఉంది. ఎందుకంటే ఆయన కూడా బయ్యర్స్ నష్టపోతే ఇదే తరహాలో సహాయాన్ని అందించేవారు.