Begin typing your search above and press return to search.

మహేష్‌ తో బాహుబలి - 3 తీస్తాడా?

By:  Tupaki Desk   |   20 July 2015 9:30 PM IST
మహేష్‌ తో బాహుబలి - 3 తీస్తాడా?
X
మహేష్‌ బిరుదు ప్రిన్స్‌. దీనర్థం రాకుమారుడు అని. అయితే ఇంతకాలం మహేష్‌ తన బిరుదును సార్థకం చేసుకునే పని అస్సలు చేయనేలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో రొటీన్‌ ఫైటింగ్‌ సినిమాల్లోనే నటించాడు కానీ, ఒక రాకుమారుడిగా శత్రువుపై లంఘించి కదనరంగంలో కత్తి పట్టి తలలు నరికే ఒక్క సినిమా కూడా చేయలేదు. యుద్ధతంత్రంలోకి దిగి భీకర పోరాటం చేసిందే లేదు. కోటలోని వన్నె చిన్నెల రాకుమారి వెంట పడి ప్రేమించిందే లేదు. అయితే ఈసారి అందుకు ఆస్కారం కనిపిస్తోంది.

సూపర్‌ స్టార్‌ మహేష్‌ తో ఇప్పటికే రాజమౌళి కథా చర్చలు సాగిస్తున్నారట. ఆ సంగతి ఇదివరకే ప్రచారమైంది కూడా. అయితే అది సామాజిక చిత్రమా? లేక బాహుబలి తరహా చిత్రమా? అన్నది ఎవరూ చెప్పలేదు. కానీ మహేష్‌ లేటెస్టుగా ఓ అప్‌ డేట్‌ చెప్పాడు. 'బాహుబలి ఎస్‌.ఎస్‌.రాజమౌళి తప్ప వేరే ఎవరూ తీయలేరు. అతడి తో నా సినిమా చర్చల దశలో ఉంది. త్వరలోనే మెటీరియలైజ్‌ అవుతుందని ఆశిస్తున్నా' అని అన్నాడు. టాటా స్కై ప్రచారకార్యక్రమంలో ప్రిన్స్‌ ఈ మాట అన్నాడు. ఇప్పుడు కూడా అదే సస్పెన్స్‌. మహేష్‌ రూపురేఖలు ఓ రాకుమారుడికి ఏమాత్రం తగ్గవు. ట్రాయ్‌ లో బ్రాడ్‌ ఫిట్‌ లా, మిషన్‌ ఇంపాజిబుల్‌ లో టామ్‌ క్రూస్‌ లా గొప్ప అందగాడు. కాబట్టి ప్రభాస్‌ తో బాహుబలి 2 పూర్తయ్యాక బాహుబలి 3 తీయాల్సి వస్తే అప్పటి ఆప్షన్‌ మహేష్‌ దే అయ్యి ఉంటుందేమో!

ఇదే జరిగితే భారతీయ సినిమా చరిత్రలో మరోసారి రికార్డులు తిరగరాయడం ఖాయం. అటు బాలీవుడ్‌ ని తలదన్నే ఛరిష్మా ఉన్న ఏకైక హీరో ప్రిన్స్‌ మహేష్‌ మాత్రమే. జక్కన్న ఏం చేస్తాడో చూడాలి.