Begin typing your search above and press return to search.
మహేష్ ఈవెంట్ రద్దు.. దేనికి సంకేతం?
By: Tupaki Desk | 24 Oct 2018 10:32 AM GMTఅమెరికాలో ఫిలిం స్టార్ల పట్ల క్రేజ్ అంతకంతకూ పడిపోతోందా? వాళ్లు వస్తుంటే ఇంతకుముందులాగా జనాలు ఎగబడిపోయే పరిస్థితి లేదా? సినీ తారలతో కలయిక కోసం కన్నూ మిన్నూ తెలియకుండా ఖర్చు పెట్టే అలవాటును అక్కడి జనాలు మార్చుకుంటున్నారా? ఇటీవలి పరిణామాలు చూస్తే ఈ సందేహాలే కలుగుతున్నాయి. గతంలో టాలీవుడ్ తారల్ని చూసేందుకు.. వాళ్లు పాల్గొనే కార్యక్రమాల్లో అవకాశం కోసం యుఎస్ జనాలు చాలా ఆసక్తిని ప్రదర్శించేవాళ్లు. సినీ తారలతో ఏవైనా ఈవెంట్లు చేసినా.. ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా.. మంచి స్పందన ఉండేది. ఈ కార్యక్రమాల ద్వారా బాగా ఆదాయం సమకూరేది. కానీ ఈ మధ్య ఈ పరిస్థితి కనిపించడం లేదు. ‘మా’ కోసం మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న ఓ కార్యక్రమానికే రెస్పాన్స్ సరిగా లేదు.
మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ కొన్ని నెలల కిందట తలపెట్టిన మ్యూజికల్ కన్సెర్ట్ కూడా ఫెయిలైంది. భారీ ఖర్చుతో పెద్ద ఆడిటోరియం తీసుకుని ఈవెంట్ చేస్తే ఆక్యుపెన్సీ చూసి నిర్వాహకులు షాకయ్యారు. ప్రైసింగ్ చాలా ఎక్కువ ఉండటంతో జనాలు ఆ కార్యక్రమంపై ఆసక్తి చూపించలేదు. దీంతో నిర్వాహకులు నష్టాల పాలు కావాల్సి వచ్చింది. తాజాగా మహేష్ బాబుతో ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమం తలపెట్టారు. దీనికి ముందు 2 వేల డాలర్లు టికెట్ రేటు పెట్టారట. జనాల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో తర్వాత రేటు తగ్గిస్తూ వెళ్లారు. అందులో నాలుగో వంతు కన్నా తక్కువ రేటు పెట్టినా కూడా ఆశించిన స్థాయిలో టికెట్లు తెగట్లేదట. దీంతో మొత్తంగా ఈ ఈవెంటే రద్దు చేసినట్లు సమాచారం. మహేష్ లాంటి పెద్ద స్టార్ వస్తున్నాడంటే కనీస స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మొత్తంగా సినీ తారల విషయంలో యుఎస్ తెలుగు జనాల్లో మునుపటి క్రేజు.. మోజు మొత్తం పోయినట్లే కనిపిస్తోంది.