Begin typing your search above and press return to search.
మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సూపర్ హిట్టు రీ రిలీజ్
By: Tupaki Desk | 2 Jun 2023 6:00 PM GMTటాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల విడుదల కంటే.. పాత సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్ సాగుతుంది. మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ... కొనసాగుతూనే ఉంది. గతేడాది పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సందర్భాన్ని బట్టి ప్రతి హీరో తమ పాత సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఈ సారి మరోసారి మహేశ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే మరో సూపర్ హిట్ సినిమా రిలీజ్ కాబోతోంది. అదేంటో అనుకుంటున్నారా...మహేష్ బాబు హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ బిజినెస్ మ్యాన్.
ఈ చిత్రం మహేష్ బాబును ఇండస్ట్రీలో మరో లెవెల్ కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. మాస్ ఆడియెన్స్ ను ఈ సినిమా ఎంతో బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్ట్ 9 సందర్భంగా గ్రాండ్ గా థియేటర్ల లో రీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని వేరే లెవెల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయనున్నారట.
ఇక ఈ చిత్రం ఆ రోజుల్లో యూత్ ను బాగా ఆకట్టుకుంది. 2012లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా వచ్చి 10 ఏళ్లు దాటినా ఆ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆ సినిమా డైలాగ్ లు ఇప్పటికీ మీమ్స్ లో వాడుతుంటారు.
ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే పలు స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది.
ఇప్పుడు మరోసారి మహేష్ వంతు వచ్చింది. ఇక మహేశ్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటురు కారం. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత జక్కన్నతో ఓ పాన్ వరల్డ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.