Begin typing your search above and press return to search.

తొలి రోజే మహేష్ రచ్చ రంబోలా

By:  Tupaki Desk   |   17 Sep 2015 6:14 AM GMT
తొలి రోజే మహేష్ రచ్చ రంబోలా
X
ఓ కొత్త సినిమా షూటింగ్ మొదలవుతోందంటే.. తొలి రోజుల్లో చిన్న చిన్న సన్నివేశాలతో మొదలుపెడతారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కొంచెం కుదురుకున్నాక భారీగా ఉండే సన్నివేశాలు - ఫైట్లు - పాటల చిత్రీకరణ జరుగుతుంది. కానీ మహేష్ బాబు కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. బుధవారం సినిమా ప్రారంభోత్సవం బ్యాంగ్ బ్యాంగ్ అన్నట్లే సాగింది. రామోజీ ఫిలిం సిటీలో తొలి రోజు ‘బ్రహ్మోత్సవం’ హంగామా మామూలుగా లేదు.

ఒక భారీ సెట్ లో ఓ భారీ పాట చిత్రీకరణతో ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ మొదలెట్టాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఓ పెళ్లికి సంబంధించి సంగీత్ వేడుకలో భాగంగా వచ్చే పాట ఇదని సమాచారం. ప్రసిద్ధ కళా దర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో 500 మందికి పైగా దాదాపు నెల రోజులు కష్టపడి ఓ భారీ సెట్ ను ఈ పాట కోసం తీర్చిదిద్దారట. శ్రీకాంత్ చాలా రోజుల ముందే ఈ పాటకు సంబంధించి రిహార్సల్స్ తో రెడీగా ఉన్నాడు.

మహేష్ ఫారిన్ ట్రిప్ ముగించుకుని రావడం ఆలస్యం.. ఈ పాట నేపథ్యంలో తెలుసుకుని నేరుగా రంగంలోకి దిగిపోయాడు. సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన 21 మంది నటీనటులతో, వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ పాటను చిత్రీకరించాడు శ్రీకాంత్. రామోజీ ఫిలిం సిటీ అంతటా బుధవారం ‘బ్రహ్మోత్సవం’ సందడే కనిపించిందని సమాచారం. నేరుగా పాట చిత్రీకరిస్తున్నారంటే ఇప్పటికే ట్యూన్లన్నీ కూడా రెడీ అయిపోయాయన్నమాటే. ముకుంద తర్వాత దాదాపు పది నెలల గ్యాప్ రావడంతో శ్రీకాంత్ అన్నీ పక్కాగా రెడీ చేసుకుని రంగంలోకి దిగినట్లున్నాడు.