Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   9 Aug 2015 11:26 AM GMT
బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ ఫిక్స్
X
1 నేనొక్కడినే, ఆగడు సినిమాలతో షాక్ ల మీద షాక్ లు తిన్న మహేష్ బాబు.. ‘శ్రీమంతుడు’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. మహేష్ కెరీర్ లోనే ‘శ్రీమంతుడు’ అతి పెద్ద సక్సెస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ ఉత్సాహంలో ఆదివారం తన 40వ పుట్టిన రోజును జరుపుకుంటున్న మహేష్.. తన తర్వాతి సినిమా విషయంలో కూడా అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చేశాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ నటించబోయే ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబంధించిన విశేషాలు ఈ రోజు బయటకు వచ్చాయి. ఈ సినిమా ఆగస్టు 18న ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ కూడా ఇప్పుడే ఫిక్స్ చేసేశారు. 2016 మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రెండు మూడు వారాలుగా ‘శ్రీమంతుడు’ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న మహేష్ వారం రోజుల పాటు వెకేషన్ కు వెళ్తున్నాడు. అక్కడి నుంచి నేరుగా వచ్చి ‘బ్రహ్మోత్సవం’ ఆరంభోత్సవంలో పాల్గొని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తాడు. ఐదు నెలల పాటు నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొని సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. పీవీపీ సంస్థ అధినేత పొట్లూరి వరప్రసాద్ నిర్మించబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతుండటం విశేషం. ఆ ముగ్గురు కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత అని సమాచారం. మిక్కీ జే మేయర్ సంగీతాన్నందిస్తాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మహేష్, శ్రీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.