Begin typing your search above and press return to search.

మహేష్‌ కర్చీఫ్‌ వేశాడు.. మీ ఇష్టం

By:  Tupaki Desk   |   17 Nov 2015 11:02 PM IST
మహేష్‌ కర్చీఫ్‌ వేశాడు.. మీ ఇష్టం
X
ఈ మధ్య కాలంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఒక ప్యాట్రన్‌ బాగా ఫాలో అవుతున్నాడు. తన సినిమాలకు సంబంధించి రిలీజ్‌ డేట్‌ ను ముందే చెప్పడం.. తద్వారా బిజినెస్‌ ఈక్వేషన్లు అన్నీ చక్కగా ముందే సెట్‌ చేసుకునే లా ప్లాను చేసుకోవడం.. ఇదే మహేష్‌ ఐడియా. సేమ్‌ టు సేమ్‌ రామ్‌ చరణ్‌ కూడా ఇదే ఫాలో అయ్యాడు ఆ మధ్య. బ్రూస్‌ లీ చెప్పిన డేటుకే వచ్చేసింది.

ట్రెండ్‌ ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు తన తదుపరి సినిమాను కూడా మహేస్‌ ఫిక్స్‌ చేసేశాడని తెలుస్తోంది. శ్రీకాంత్‌ అడ్డాల డైరక్షన్‌ లో వస్తున్న ''బ్రహ్మోత్సవం'' సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఏప్రియల్‌ 8న రిలీజ్‌ చేస్తారట. ఇప్పటినుండే ఈ విషయాన్ని నిర్మాత పివిపి అందరికీ చెబుతున్నట్లు తెలుస్తోంది. మొన్ననే ఆయన ఇతర ప్రొడ్యూసర్లతో కలసి తన సైజ్‌ జీరో రిలీజ్‌ డేట్‌ ను ఇదే విధంగా ఫిక్స్‌ చేసుకున్నాడు. మరోసారి అలా పెద్ద పెద్ద డిస్కషన్లు చేయకుండా.. ఇప్పుడు ముందుగానే సమ్మర్‌ లో 8వ తేదీ మాదే అన్నట్లు ప్రకటించేస్తున్నారట.

ఇకపోతే ఏప్రియల్‌ లోనే పవన్‌ కళ్యాణ్‌ తన సర్దార్‌ సినిమాను.. బన్నీ తన సరైనోడు సినిమాను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ రెండు వారాల గ్యాప్‌ తో ఇంకో సినిమా రిలీజ్‌ చేద్దామని అనుకున్నా.. మహేష్‌ కర్ఛీఫ్‌ వేశాడు కాబట్టి.. మరి పవన్‌.. బన్నీ..లలో ఎవరు తగ్గుతారనేది వారిష్టం.