Begin typing your search above and press return to search.

#ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోసం సమయాన్ని కేటాయించిన మహేష్...!

By:  Tupaki Desk   |   30 Jun 2020 12:00 PM IST
#ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోసం సమయాన్ని కేటాయించిన మహేష్...!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్రీ టైమ్ దొరికితే తన ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడనే విషయం అందరికి తెలిసిందే. ఇక సినిమాలు చూడటం.. పిల్లలతో ఆదుకోవడం ఇలానే సింపుల్ గా ఉంటుంది మహేష్ డైలీ లైఫ్. అయితే మహేష్ సమయం దొరికినప్పుడు మంచి పుస్తకాలు కూడా చదువుతాడని చాలా కొద్దిమందికే తెలుసు. తన సన్నిహితులు ఎవరైనా ఈ బుక్ బాగుంది అని సజెస్ట్ చేస్తే మహేష్ వెంటనే ఆ పుస్తకం చదవడానికి కూర్చుంటాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో కావాల్సినంత సమయం దొరకడంతో మహేష్ పుస్తకాలు చదివేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్' అనే బుక్ చదివేశాడు మహేష్. ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో వెల్లడించారు.

ఈ సందర్భంగా మహేష్ ''#ఎమోషనల్ ఇంటెలిజెన్స్!! సైన్టిఫిక్ అండ్ సంచలనాత్మకం. ఏ టోటల్ గేమ్ ఛేంజర్ ... అత్యంత సిఫార్సు చేయబడింది. ఈ వారం డేనియల్ గోల్‌ మ్యాన్ కు కేటాయించబడింది!!'' అని పోస్ట్ చేసారు. డేనియల్ గోల్‌ మ్యాన్ రచించిన 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్' బుక్ గత కొన్ని వారాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అమ్ముడుబోయిన పుస్తకంగా నిలిచింది. మొత్తం మీద సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ క్వారంటైన్ సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. భార్యా పిల్లలతో ఇంట్లోనే ఉంటూ సరదాగా గడుపుతున్నారు. డైలీ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ తన కెరీర్లో 27వ చిత్రంగా 'సర్కారు వారి పాట' ని అధికారికంగా అనౌన్స్ చేసారు. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కరోనా పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చిన వెంటనే స్టార్ట్ చేయనున్నారు.