Begin typing your search above and press return to search.

గండిపేటలో ల్యాండ్ కొన్న మహేష్

By:  Tupaki Desk   |   8 Feb 2016 10:14 AM IST
గండిపేటలో ల్యాండ్ కొన్న మహేష్
X
సినిమా స్టార్స్ కి మూవీస్ పాటే ఇతర వ్యాపారాలు కూడా ఉంటాయి. తమ పెట్టుబడిని కాపాడుకునేందుకు, పెంచుకునేందుకు రకరకాల బిజినెస్ లు చేస్తూ ఉంటారు. అందులో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒకటి. ఫలానా ప్రాంతంలో పవన్ - ఫలానా చోట నాగ్ స్థలాలు - ప్రాపర్టీలు కొన్నారంటూ గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడీ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జాయిన్ అయ్యాడు.

సినిమాలు - యాడ్స్ కాకుండా.. ఇతర వ్యాపకాలతో మహేష్ గురించి న్యూస్ తక్కువగానే వస్తాయి. దీనికి కారణం ఈయన, ఈయన ఫ్యామిలీ లోప్రొఫైల్ మెయింటెయిన్ చేయడమే. తాజాగా మహేష్ బాబు హైద్రాబాద్ పొలిమేరలోని గండిపేటలో భూమి కొనుగోలు చేశాడని తెలుస్తోంది. 3 ఎకరాల ల్యాండ్ ని కొనుగోలు చేశాడని తెలియడంతో రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు సినీ జనాలు.

ఈ వెంచర్ పై సడెన్ గా ఎందుకు ఇన్వెస్ట్ చేశాడో తెలీకపోయినా.. కోట్లు ఖరీదు చేసే ల్యాండ్ ని కొనడమంటే ఖచ్చితంగా పెద్ద రీజనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదైనా పెద్ద ప్రాజెక్టుని ప్లాన్ చేస్తున్నాడని అనుకుంటున్నారు సిని జనాలు. ఓషన్ పార్క్ కి దగ్గరలో ఉండే ఊ భూమిని మహేష్ కొనుగోలు చేయడంతో.. చుట్టుపక్కల ప్రాంతాలకు ఇప్పటికే డిమాండ్ వచ్చేసింది.