Begin typing your search above and press return to search.
అన్ లాక్ తర్వాత అరవ తంబీల వద్దకు మన సూపర్ స్టార్
By: Tupaki Desk | 15 Oct 2020 8:50 AM GMTకరోనా లాక్ డౌన్ కారణంగా ఏడు నెలల పాటు థియేటర్లలో బొమ్మ పడిందే లేదు. నేటి నుండి కేంద్రం మార్గదర్శకాలతో థియేటర్ల ఓపెన్ కు అనుమతులు ఇచ్చింది. అయితే ఇప్పటికి కూడా కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు బొమ్మ వేయలేదు. దక్షిణాన బెంగళూరులో మాత్రమే సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి. తమిళనాడులో కూడా త్వరలో థియేటర్లను పూర్తి స్థాయిలో తెరిచేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. థియేటర్లు ఓపెన్ చేసిన వెంటనే వాటికి పాత సినిమాలే స్వాగతం పలుకుతున్నాయి. కన్నడ ప్రేక్షకులను అల వైకుంఠపురంలో.. భీష్మ సినిమాలు ఎంటర్ టైన్ చేసేందుకు వెళ్లాయి. ఇప్పుడు తమిళ ఆడియన్స్ వద్దకు మన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో వెళ్లబోతున్నాడు.
తమిళనాట థియేటర్లు అన్ లాక్ అయిన వెంటనే సరిలేరు నీకెవ్వరు సినిమా తమిళ వర్షన్ ఇవనుక్కు సరియానా ఆల్లి ను విడుదల చేసేందుకు డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న నిర్మాత రెడీగా ఉన్నాడు. దాదాపుగా 150 నుండి 200 స్ర్కీన్ లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహేష్ బాబు సినిమాలు గతంలో తమిళనాట విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అన్ లాక్ లో మొదట విడుదల కాబోతున్న డబ్బింగ్ సినిమా అవ్వడం వల్ల ఈ సినిమాకు తమిళ తంబీల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.