Begin typing your search above and press return to search.

డైరెక్టర్‌ కు సూపర్‌ స్టార్‌ విషెష్‌

By:  Tupaki Desk   |   17 Aug 2020 3:00 PM GMT
డైరెక్టర్‌ కు సూపర్‌ స్టార్‌ విషెష్‌
X
సౌత్‌ సినిమా సత్తాను బాలీవుడ్‌ తో పాటు అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శకులు రాజమౌళి శంకర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు శంకర్‌ పుట్టిన రోజు సందర్బంగా ఎంతో మంది ఆయనకు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. చాలా అరుదుగా మహేష్‌ బాబు సోషల్‌ మీడియా ద్వారా స్టార్స్‌ కు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. ఈసారి దర్శకుడు శంకర్‌ కు మహేష్‌ బాబు బర్త్‌ డే శుభాకాంక్షలు చెప్పారు. మీరు ముందు ముందు మరిన్ని మంచి ప్రాజెక్ట్‌ లు చేయాలంటూ కోరుకుంటున్నాను అంటూ మహేష్‌ బాబు ట్విట్టర్‌ లో పేర్కొన్నాడు.

వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మహేష్‌ బాబు ట్వీట్‌ తో మళ్లీ విషయమై ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. సౌత్‌ ఇండియా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత దర్శకుడు శంకర్‌ సినిమాలో కూడా మహేష్‌ బాబు నటించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం కమల్‌ హాసన్‌ తో ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని చేస్తున్న శంకర్‌ ఆ తర్వాత విజయ్‌ లేదా రజినీకాంత్‌ లతో సినిమాలను చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఇండియన్‌ 2 పున: ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాదిలో ఇండియన్‌ 2 వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.