Begin typing your search above and press return to search.

ప్రేమ - స్నేహం - జీవితం ఆమెకే -మహేష్

By:  Tupaki Desk   |   22 Jan 2018 7:08 AM GMT
ప్రేమ - స్నేహం - జీవితం ఆమెకే -మహేష్
X
మహేష్ బాబు ప్రస్తుతం ప్రొఫెషనల్ గా ఫుల్ బిజీగానే ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను మూవీ కోసం ఫుల్ స్వింగ్ లోనే వర్క్ చేస్తున్నాడు. ఏప్రిల్ నాటికి విడుదల చేయాలనే టార్గెట్ ను అందుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు మహేష్.

అయితే ప్రొపెషనల్ గా ఎంత బిజీగా ఉన్నా.. వ్యక్తిగత వ్యవహారాలను.. ముఖ్యంగా కుటుంబ సంబంధిత అంశాలకు విపరీతమైన ప్రాముఖ్యత ఇస్తాడు మహేష్. కుటుంబంతో కలిసి అనేక దేశాలను చుట్టేయడమే కాదు.. ప్రతీ కుటుంబ వేడుకలోను తన పర్సనల్ ప్రెజెన్స్ ఉండేలా జాగ్రత్త పడతాడు. అసలు మహేష్ బాబును చూసి చాలా మంది సినిమా హీరోలు.. కుటుంబానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ను నేర్చుకున్నారని కూడా చెప్పేయచ్చు. ఇప్పుడు తను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న నమ్రత పుట్టిన రోజు సందర్భంగా.. మహేష్ పెట్టిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. తన భార్య నమ్రత.. కొడుకు గౌతమ్.. కూతురు సితారలతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సూపర్ స్టార్.

'నువ్వు నాకు ఎందుకు చాలా చాలా స్పెషల్ అని చెప్పేందుకు ఇది మరో కారణం.. నా ప్రేయసి.. నా బెస్ట్ ఫ్రెండ్.. నా భార్య.. అయిన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు మహేష్ బాబు. ఒక్క ట్వీట్ లోనే తన జీవితం అంతా తన భార్యే అంటూ మహేష్ చెప్పిన తీరు సూపర్ కదూ.