Begin typing your search above and press return to search.
మహేష్ B-డే స్పెషల్ గా రాజమౌళితో ప్రకటిస్తారా?
By: Tupaki Desk | 8 Aug 2021 4:03 AM GMTసూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు ఉత్సవానికి అభిమానులు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫ్యాన్స్ ని థ్రిల్ చేయడానికి మహేష్ బాబు ఏం చేయబోతున్నారు? అతడి నుంచి ఎలాంటి ప్రకటనలు వెలువడనున్నాయి? అన్నది సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ పుట్టినరోజున `సర్కార్ వారి పాట` నుంచి అభిమానులకు సర్ ప్రైజ్ లు అందనున్నాయి.
హీరో మహేష్ బాబు ఈ సోమవారం (ఆగస్టు 9) పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ఇన్ స్టా వేదికగా అభిమానుల హంగామా ఓ రేంజులో కొనసాగుతోంది. నేటి అర్ధరాత్రి 12 AM కి మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `సర్కారు వారి పాట` నుండి ప్రత్యేక పుట్టినరోజు పోస్టర్ ఆవిష్కరిస్తారు. 09-08-2021 ఉదయం 9 గంటలకు సూపర్ స్టార్ పుట్టినరోజు బ్లాస్టర్ టీజర్ వస్తుంది. చివరగా మహేష్ బాబు - త్రివిక్రమ్ తదుపరి చిత్రంపై ఆశ్చర్యకరమైన అప్ డేట్ ని వెల్లడిస్తారు. అందుకే అభిమానులందరికీ ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పొచ్చు.
అయితే మహేష్ పుట్టినరోజు ఇంటర్వ్యూల్లో ఇంకా చాలా సర్ ప్రైజ్ లను అభిమానులు ఆశిస్తున్నారు. పరశురామ్ తో సినిమా పూర్తవ్వగానే త్రివిక్రమ్ తో సినిమా చేస్తారు. ఆ తర్వాత అయినా రాజమౌళితో సినిమా ఉందా లేదా? అన్నదానికి ఆన్సర్ కావాలి. మహేష్ కానీ రాజమౌళి కానీ దీనిపై ఏదైనా ప్రకటిస్తే బావుంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మహేష్ ఇప్పటివరకూ ఇండియా లెవల్లో భారీ పాన్ ఇండియా సినిమా చేయలేదు. ఒకవేళ రాజమౌళితో అతడు ప్రాజెక్ట్ ని ప్రకటిస్తే అది మాత్రమే పాన్ ఇండియా అప్పీల్ ని కలిగి ఉంటుందన్న భావన నెలకొంది. ఇక త్రివిక్రమ్ తోనూ పాన్ ఇండియా సినిమా చేస్తారని చెబుతున్నా కానీ.. దర్శకధీరునితో ప్రకటన వెలువడితేనే అభిమానులకు అసలు కిక్కు.