Begin typing your search above and press return to search.
‘భరత్’లో అది లేకుంటే కష్టమే..
By: Tupaki Desk | 9 April 2018 12:59 PM GMTవేసవి బరిలో ఉన్న తొలి భారీ సినిమా ‘రంగస్థలం’ విడుదలైంది. అంచనాల్ని మించిన విజయంతో దూసుకెళ్తోంది. ఇక అందరి కళ్లూ ‘భరత్ అనే నేను’ మీదే నిలిచి ఉన్నాయి. ఈ సినిమా మీదా అంచనాలు మామూలుగా లేవు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే కొత్త రికార్డులు నమోదవడం ఖాయం. మూడు బ్లాక్ బస్టర్లు తీసిన కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కడం.. పైగా మహేష్-కొరటాల దర్శకత్వంలో ఇంతకుముందు ‘శ్రీమంతుడు’ లాంటి సినిమా రావడంతో ఈ చిత్రంపై సూపర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ఈ సినిమా మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది. ఈ చిత్ర ప్రోమోలు కుడా పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి.
ఐతే ‘భరత్ అనే నేను’ ఏ రేంజికి వెళ్తుందన్నది ఇందులోని ఎంటర్టైన్మెంట్ ను బట్టే ఉంటుంది.ఈ చిత్ర టీజర్ చూసినా.. ట్రైలర్ చూసినా..ఇది పూర్తి సీరియస్ కథతో తెరకెక్కిన సినిమాలా కనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్ ఛాయలు పెద్దగా కనిపించలేదు. రాజకీయాల నేపథ్యంలో పైగా హీరోది సీఎం పాత్ర అనగానే ఒక ఇంటెన్సిటీ చూపించాలి. సీరియస్ నెస్ ఉండాలి. ప్రేక్షకుల్ని ఆ దిశగా సిద్ధం చేయడానికేనేమో కొరటాల కూడా టీజర్..ట్రైలర్లలో వేరే అంశాలేమీ చూపించలేదు.ఇదొక సీరియస్ కథ అనే సంకేతాలిచ్చాడు.ఐతే సినిమా అంతా సీరియస్ గానే సాగితే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది సందేహం. ‘శ్రీమంతుడు’ కూడా సీరియస్ కథే.కానీ ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల ట్రాక్ ను వినోదాత్మకంగా నడిపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఫన్ రాబట్టాడు. ఐతే ‘భరత్ అనే నేను’ మాత్రం అలాంటి సంకేతాలేమీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రెండున్నర గంటలకు పైగా నిడివి ఉన్న సినిమాను పూర్తి సీరియస్ గా నడిపిస్తే జనాలకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో చూడాలి. కాకపోతే కొరటాల తన కథలోని ఇంటెన్సిటీ.. సీరియస్ నెస్ తగ్గకుండానే వినోదాన్ని జోడించడంలో సిద్ధహస్తుడు. మరి బయటికి రివీల్ చేయకుండా సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఏదైనా దాచాడేమో చూడాలి.