Begin typing your search above and press return to search.

మహేష్.. సమ్మరే అసలు టార్గెట్

By:  Tupaki Desk   |   18 Oct 2017 11:00 AM GMT
మహేష్.. సమ్మరే అసలు టార్గెట్
X

సాదారణంగా ఒక సినిమాను మొదలు పెడితే ఎప్పుడు పూర్తవుతోంది అనే విషయం కరెక్ట్ చెప్పాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. చిన్న సినిమాలు బడ్జెట్ పరమైన కారణాలు తెప్పితే మరే సమస్య ఉండదు. ఆ ఒక్క సమస్య లేకుంటే రెండు నెలల్లో పూర్తి చేస్తారు. అయితే పెద్ద సినిమాలు కూడా ముందుగా ఒక డేట్ ను అనుకుంటాయి కానీ ఇతర నటీనటుల వల్ల అప్పుడపుడు షూటింగ్ కి బ్రేకులు పడతాయి. దీంతో సినిమా అనుకున్న డేట్ కి రావడం కుదరదు. ఒక నెల లేదా రెండు నెలల తర్వాత రిలీజ్ చేస్తారు.

ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ క్యాన్సిల్ అయ్యిందని టాక్. ఏకంగా రెండు నెలలు ఎక్కువగా టైమ్ తీసుకొని సినిమాని రిలీజ్ చెయ్యాలని భావిస్తోందట చిత్ర యూనిట్. స్పైడర్ తర్వాత మహేష్ చేస్తున్న చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాని మహేష్ స్పైడర్ షూటింగ్ చివారిదశలో ఉండగానే స్టార్ట్ చేశాడు. అప్పుడు.. వచ్చే సంక్రాంతి కి రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. కానీ ఇప్పుడు డేట్ మార్చిందట. వచ్చే ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా కూల్ గా రిలీజ్ అవ్వనుందని టాక్.

అసలైతే కొరటాల శివ వేసుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా అనుకున్నట్టు జరిగి ఉంటే తప్పకుండా సినిమా సంక్రాంతి కి రిలీజ్ అయ్యేది. కానీ మహేష్ బాబు స్పైడర్ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం కొరటాల ప్రాజెక్టును పక్కనపెట్టడంతో షెడ్యూల్ లో చాలా మార్పులు వచ్చాయి. అదే విధంగా మహేష్ స్పైడర్ రిజల్ట్ తో కంగుతిని కొంచెం గ్యాప్ తీసుకున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా మహేష్ మళ్లీ రెంగ్యులర్ షెడ్యూల్ లో పాల్గొనడానికి డిసైడ్ అవ్వడంతో వచ్చే ఏడాది మార్చ్ లోపు సినిమాను పూర్తి చేసి ఏప్రిల్ లో విడుదల చెయ్యాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. వెయిట్ అండ్ సి.