Begin typing your search above and press return to search.

మహేష్ సినిమాకు మంచి రేట్

By:  Tupaki Desk   |   26 Sep 2017 9:30 AM GMT
మహేష్ సినిమాకు మంచి రేట్
X
జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్న హీరో మహేష్ బాబు. గత చిత్రం బ్రహ్మోత్సవం ఆయన కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.. అయితే ఈ సారి ఎలాగైనా భారీ స్థాయిలో హిట్ కొట్టాలని ఒకే సారి తెలుగు - తమిళ్ లో స్పైడర్ సినిమాను తెరకెక్కించాడు. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

అయితే మహేష్ స్పైడర్ సినిమాతో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో తెలియదు గాని మహేష్ నెక్స్ట్ సినిమా భారత్ అనే నేను మాత్రం షూటింగ్ పూర్తవ్వకముందే రికార్డు స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ రేట్స్ ను అందుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఆ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండనుంది. ఇక మహేష్ ముఖ్యమంత్రి గా కనిపించబోతున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అదే స్థాయిలో భారత్ అనే నేను సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే నమ్మకంతో పంపిణీదారులు భారీ స్థాయిలో చెల్లించి మరి కొనుక్కుంటున్నారు. ముఖ్యంగా యూఎస్ ఓవర్సీస్ రైట్స్ మొత్తం 18.18 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

అయితే అంతే స్థాయిలో త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా యుఎస్ ఓవర్సీస్ రైట్స్ 19.19 కోట్లకు అమ్ముడుపోవచ్చని ట్రేడ్ అనలిస్ట్ లు భావిస్తున్నారు. చూస్తుంటే రెండు సినిమాలు మంచి అమౌంట్స్ నే దక్కించుకున్నాయి. దీంతో భారీ స్థాయిలో అక్కడ రిలీజ్ అవుతాయి గనక 5 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేస్తే తప్ప బయ్యర్స్ కి లాభాల్ని అందించలేవని తెలుస్తోంది. మరి ఎంతవరకు రాబడతాయో చూడాలి.