Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : అందమైన ప్రాంతంలో అందమైన ఫ్యామిలీ
By: Tupaki Desk | 20 Oct 2021 12:08 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలోని ఒక డ్యూయెట్ ను ప్రపంచంలోని అందమైన ప్రాంతాల్లో ఒక్కటి అయిన స్పెయిన్ బార్సీలోనా లో చిత్రీకరిస్తున్న విషయం తెల్సిందే. ఒక వైపు కీర్తి సురేష్ తో రొమాంటిక్ డ్యూయెట్ ను చేస్తున్న మహేష్ బాబు మరో వైపు కుటుంబంతో కలిసి బార్సీలోనా లో అందాలను ఆస్వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. నమత్ర తాజాగా ఈ ఫొటో ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కూతురు సితార మరియు కొడుకు గౌతమ్ తో కలిసి నమ్రత ఇలా బార్సీలోనాలోని ఒక అందమైన లొకేషన్ లో కెమెరాకు ఫోజ్ ఇచ్చింది. మహేష్ బాబు స్పెయిన్ కు సర్కారు వారి పాట చిత్రీకరణ కోసమే కాకుండా కుటుంబంతో కలిసి సరదాగా విహార యాత్ర కూడా చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో వెళ్లడు.
మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో నమ్రత మరియు పిల్లలు స్పెయిన్ అందాలను అలా అలా ఆస్వాదిస్తూ హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా కారణంగా చాలా కాలంగా విదేశాల్లో పర్యటనలు చేయడం లేదు. కరోనాకు ముందు మహేష్ బాబు ఫ్యామిలీ రెగ్యులర్ గా షూటింగ్ లకు కాకుండా విదేశాలకు హాలీడే ట్రిప్స్ వేసేవారు. చాలా కాలం తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీ స్పెయిన్ ట్రిప్ వేశారు. ఒక వైపు సర్కారు వారి పాట చిత్రీకరణ చేస్తూనే మహేష్ బాబు ఫ్యామిలీతో హాలీడేలో ఉన్నాడు. మొత్తానికి రెండు వైపుల కూడా న్యాయం చేసే విధంగా మహేష్ బాబు వ్యహరిస్తున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నమ్రత షేర్ చేసిన ఈ ఫొటోలో గౌతమ్ మరియు సితారలు చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తున్నారు. గౌతమ్ చూస్తుండగానే పెద్ద వాడు అవుతున్నాడు.. తల్లిని మించిన హైట్ అయ్యడు.. త్వరలోనే గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమా లో గౌతమ్ నటించాడు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కూడా గౌతమ్ సినిమాల్లో నటించలేదు. గౌతమ్ హీరోగానే నేరుగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మహేష్ బాబు ఫ్యామిలీ మరోసారి సోషల్‌మీడియాలై వైరల్ అవుతోంది. అందమైన బార్సీలోనాలో అందమైన ఫ్యామిలీ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.