Begin typing your search above and press return to search.
ఆ వేడుకలో మహేష్ ముసిముసి నవ్వులు
By: Tupaki Desk | 17 March 2017 5:53 AM GMTచిన్న చిత్రాలకు సడెన్ గా క్రేజ్ రావాలంటే.. స్టార్ అట్రాక్షన్ తప్పనిసరి. మూవీలో స్టార్ క్యాస్టింగ్ లేకపోతే.. పబ్లిసిటీ యాక్టివిటీస్ లో స్టార్లను మిళితం చేస్తుంటారు. చంటిగాడు.. లవ్ లీ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకురాలు బి.జయ.. ప్రస్తుతం వైశాఖం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
హరీష్-అవంతిక మిశ్రా జంటగా నటించిన ఈ వైశాఖం చిత్రం ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి ఆడియో వేడుక నిర్వహించగా.. దీనికి మహేష్ బాబు హాజరు కావడం విశేషం. టాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రమే కాకుండా.. మాటల మాంత్రికుడిగా గుర్తింపు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్టార్ డైరెక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్న వంశీ పైడిపల్లి కూడా ఈ ఈవెంట్ లో కనిపించారు. 'మీలాంటి సూపర్ స్టార్లు ఇలా చిన్న సినిమా కోసం సమయం చేసుకోవడం ఎంతో ఆనందంగాను.. ప్రోత్సాహాన్ని ఇచ్చేదిగాను ఉంది. థ్యాంక్యూ వెరీమచ్' అంటూ తన ఆనందాన్ని తెలిపాడు వైశాఖం హీరో హరీష్.
వైశాఖం ఆడియో వేడుకలో మహేష్-త్రివిక్రమ్-వంశీ పైడిపల్లి ముగ్గురూ కలిసే ఉండడం.. వారిలో వారే జోక్స్ వేసుకుంటూ నవ్వుకోవడం.. ముఖ్యంగా త్రివిక్రమ్ మాటలకు మహేష్ ముసిముసి నవ్వులు నవ్వడం అందరినీ భలే ఆకట్టుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/