Begin typing your search above and press return to search.

మ‌హేష్ వ‌ర్సెస్ హృతిక్! అల్లు `రామాయ‌ణం` ఏమైన‌ట్టు?

By:  Tupaki Desk   |   14 April 2021 6:31 AM GMT
మ‌హేష్ వ‌ర్సెస్ హృతిక్! అల్లు `రామాయ‌ణం` ఏమైన‌ట్టు?
X
మహేష్ బాబు- హృతిక్ రోషన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నితేష్ తివారీ రామాయణం సినిమాని తెర‌కెక్కిస్తార‌ని ప్ర‌చార‌మైంది. ఇందులో మ‌హేష్ శ్రీ‌రాముడిగా న‌టిస్తే.. హృతిక్ రావ‌ణాసురుడిగా క‌నిపిస్తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. ప‌లు భాష‌ల నుంచి ఇత‌ర కీల‌క పాత్ర‌ల‌కు ఎంపిక‌లు సాగుతున్నాయ‌న్న ప్ర‌చారం సాగింది. కానీ ఈ సినిమాపై ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.

ఇప్ప‌టికే ఓం రౌత్ (తానాజీ ఫేం) తన రామాయణ వెర్షన్ ఆదిపురుష్ 3డిని ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టిస్తుంటే.. సైఫ్ అలీ ఖాన్ రావ‌ణాసురుడిగా న‌టిస్తున్నారు. ఈ సినిమా మొద‌ల‌వ్వ‌డంతో నితీష్ తివారీ రామాయణం హృతిక్ రోషన్ - మహేష్ బాబులతో రామాయ‌ణం ఆపేశార‌న్న సందిగ్ధ‌త కొంత‌కాలంగా వ్య‌క్త‌మ‌వుతోంది. 2019 లో ప్రకటించినప్పటి నుండి దానిపై ఎటువంటి అప్ డేట్ రాక‌పోవ‌డంతో ఈ సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజా స‌మాచారం మేర‌కు నితీష్ ఈ ప్రాజెక్ట్ ని ఆప‌లేదని తెలుస్తోంది. హిందూ పురాణం రామాయ‌ణంపై లైవ్-యాక్షన్ ఫీచర్ చిత్రం పూర్తిస్థాయిలో తెర‌కెక్కిస్తార‌ట‌. మధు మంతెన- అల్లు అరవింద్ - నమిత్ మల్హోత్రా ఈ భారీ ప్రాజెక్ట్ కు నిర్మాత‌లుగా కొన‌సాగుతారు. ఇది వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉందిట‌. 3డిలో బహుభాషా చిత్రంగా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

తివారీ తన మూడు భాగాల రామాయణ సిరీస్ క‌థ‌ల్ని సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్.. మహేష్ బాబులకు అందించార‌ని.. సూపర్ స్టార్స్ ఇద్దరూ స్క్రిప్టు విష‌యంలో ఆసక్తి చూపారని కానీ ఇంకా దానికి సిద్ధ‌మేన‌ని ఎవ‌రూ చెప్ప‌లేద‌ని గుస‌గుసా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం మేక‌ర్స్ పూర్తి కథనం రెడీ చేస్తున్నార‌ట‌.

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కించాల్సి ఉంది. కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చ‌బ్రా బృందం హిందీ- తమిళం- తెలుగు- మలయాళం- గుజరాతీ- పంజాబీ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులను ఆడిషన్ చేస్తోందని కూడా గుస‌గుస వినిపిస్తోంది. దంగల్ ఫేమ్ తివారీ మామ్ ఫేమ్ రవి ఉద్యోవర్ ఈ చిత్రాన్ని భారతదేశంలో ఎన్నడూ ప్రయత్నించని స్థాయిలో గొప్ప‌గా తెర‌కెక్కించాల‌న్న పంతంతో ఉన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో వారు ఈ చిత్రానికి ఆకృతి ఇవ్వడంలో బిజీగా ఉన్నారని వీడియో కాల్స్ కాన్ఫరెన్స్ కాల్స్ పై రచయితలు సాంకేతిక బృందాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని కూడా ప్ర‌చార‌మ‌వుతోంది. స్క్రీన్ ప్లే రాస్తున్న శ్రీధర్ రాఘవన్ కథ అభివృద్ధిలో పండితుల బృందం నుండి సహాయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

సెట్టింగ్ కాస్ట్యూమ్స్ యాక్షన్ కోసం దేశవ్యాప్తంగా కళాకారులు సృష్టించిన క్లిష్టమైన పెయింటింగ్స్ ను వారు సేకరించారు. వాటిలో రాముని జన్మస్థలం అయోధ్య బంగారు-స్ప్లాష్డ్ లుక్ తో లంక.. నేపాల్ వాస్తుశిల్పంతో పచ్చటి మిథిలా పెయింటింగులు ఉన్నాయి. దేవతలు రాక్షసుల మధ్య యుద్ధాలు .. నీటి అడుగున జీవితం యుద్ధాలు వంటి వాటిపైనా పెయింటింగ్ వ‌ర్క్ చేశార‌ట‌.

మ‌హేష్ ఎస్.ఎస్ రాజమౌళితో సినిమా చేయాల్సి ఉండ‌గా రామాయ‌ణం చేస్తారా చేయ‌రా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం రావాల్సి ఉంటుంది. అలాగే హృతిక్ కాల్షీట్లు పెద్ద స‌మ‌స్య అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి స‌మ‌స్య‌ల‌తో ఇదే చిత్రాన్ని మరో ఇద్దరు పెద్ద సూపర్ స్టార్లతో నితీస్‌ ప్రయత్నిస్తారా? అన్న చ‌ర్చ కూడా సాగుతోంది.

ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారీ సందిగ్ధ‌త‌లు తొల‌గిపోయే వర‌కూ ఈ భారీ ప్రాజెక్టుపై ఎలాంటి ప్ర‌క‌ట‌నా ఉండ‌ద‌ని వ‌చ్చే ఏడాదిలో క్లారిటీ రావొచ్చ‌న్న గుస‌గుస‌లు ఒక‌వైపు వినిపిస్తున్నాయి.