Begin typing your search above and press return to search.

ముఖ్య‌మంత్రిగా మ‌హేష్‌ బాబు?

By:  Tupaki Desk   |   24 Nov 2016 5:00 PM IST
ముఖ్య‌మంత్రిగా మ‌హేష్‌ బాబు?
X
మాస్ క‌థానాయ‌కులు తెర‌పై పొలిటిషియ‌న్లుగా క‌నిపించిన‌ప్పుడు ఫ్యాన్స్‌లో ఆనందం క‌ట్ట‌లు తెంచుకుంటుంది. సహ‌జంగానే పాలిటిక్స్ అనేస‌రికి మాస్ జ‌నాలు ప్ర‌త్యేకమైన ఆస‌క్తి చూపుతుంటారు. త‌మ క‌థానాయ‌కుడు నిజంగానే ఆయా ప‌ద‌వుల్ని అలంక‌రించిన‌ట్టుగా ఊహిస్తూ థియేట‌ర్ల‌లో సంబ‌రాలు చేసుకొంటుంటారు. మ‌హేష్‌ బాబునే తీసుకోండి. `దూకుడు`లో ఖ‌ద్దరు దుస్తులేసి యంగ్ ఎమ్మెల్యే పాత్ర‌లో క‌నిపించిన‌ప్పుడు ఆయ‌న ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే గెట‌ప్‌ లో మ‌హేష్‌ బాబుని సీఎం పీఠంపై కూర్చున్నట్టు ఊహించుకోండి. ఆలోచిస్తేనే అదిరిపోవ‌డం లేదూ! ఇక అభిమానులైతే ఆ పాత్ర‌లో మ‌హేష్‌ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుత‌లో ఉంటారు. ఆ ఆత్రుతని ఏమాత్రం త‌గ్గించుకోవ‌ద్ద‌ని వాళ్ల‌కి చెప్పండి. ఎందుకంటే మ‌హేష్‌ బాబు త్వ‌ర‌లోనే తెర‌పై సీఎంగా క‌నిపించ‌బోతున్నాడు.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న కొత్త చిత్రంలో మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ సినిమాలోనే మ‌హేష్ సీఎంగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అనుకోకుండానే ఆయ‌న్ని సీఎం ప‌ద‌వి వ‌రిస్తుంద‌ట‌. అయితే ఆ ప‌ద‌విలో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చే వాతావ‌ర‌ణం ఉండ‌ద‌ట‌. దాంతో మ‌హేష్ త‌న‌కి తానే సంఘ‌ర్ష‌ణ‌కి గుర‌వుతుంటాడ‌ట‌. ఆ స‌న్నివేశాలు సినిమాకి హైలెట్ కానున్నాయ‌ని స‌మాచారం. జ‌న‌తా గ్యారేజ్‌ లో గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస్ ఎపిసోడ్‌ లాగానే మ‌హేష్ సీఎం పాత్ర ఎపిసోడ్ ఉంటుంద‌ని స‌మాచారం. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించబోతోంద‌ని స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/