Begin typing your search above and press return to search.

లీక్డ్ పిక్: ఆర్మీ ఆఫీసర్ గా సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   8 July 2019 11:32 AM IST
లీక్డ్ పిక్: ఆర్మీ ఆఫీసర్ గా సూపర్ స్టార్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా మహేష్ కూడా టీమ్ తో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో మహేష్ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. మరి మహేష్ ఈ గెటప్ లో ఎలా ఉన్నాడో అని ఆసక్తి కలగడం సహజమే. తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఆన్ లొకేషన్ పిక్ లీక్ అయింది.

మిలిటరీ దుస్తులు ధరించిన మహేష్ బాబు తన బెటాలియన్ లోని ఇతర ఆర్మీ కొలీగ్స్ తో ఏదో సీరియస్ గా చర్చిస్తున్నట్టుగా ఉన్నాడు. నడుముపై చేతిని పెట్టుకుని సూపర్ డూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు మహేష్. ఇక మిలిటరీ యూనిఫామ్ పై ఉన్న బ్యాడ్జిలు చూస్తుంటే ఏదో సాదా సీదా జవానులా కాకుండా ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ లాగా అనిపిస్తోంది. ఈ ఫోటో లీక్ అవ్వడం ఆలస్యం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒక కీలకపాత్రలో నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అనిల్ సుంకర.. దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చేఏడాది సంక్రాంతికి ఈ సినిమా ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.