Begin typing your search above and press return to search.
ముఖ్యమంత్రిగా మహేష్.. ఎంతసేపు?
By: Tupaki Desk | 4 March 2018 10:00 AM GMTకెరీర్లో తొలిసారి రాజకీయాల నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. అతను కథానాయకుడిగా కొరటాల శివ రూపొందిస్తున్న ‘భరత్ అనే నేను’ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రోమోలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడనే విషయంలోనూ స్పష్టత వచ్చేసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే ఆడియో క్లిప్ తో ఆ విషయం స్పష్టమైంది. ఐతే ‘భరత్ అనే నేను’లో మహేష్ ఎంతసేపు ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు.. సినిమా అంతటా సీఎంగానే ఉంటాడా అనే విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఐతే చిత్ర వర్గాల సమాచారం ప్రకారం మహేష్ మరీ ఎక్కువ సేపేమీ ముఖ్యమంత్రిగా కనిపించడట. అతడిని ఎన్నారైగా పరిచయం చేసి.. లండన్ నేపథ్యంలో కథను నడిపించి.. ఆ తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తారట. అనుకోకుండా మహేష్ ముఖ్యమంత్రి అవుతాడట. ఆపై అతనే ఆ పదవిని వదిలేస్తాడట. మొత్తంగా ఓ అరగంటకు పైచిలుకు సమయం మాత్రమే మహేష్ సీఎంగా కనిపిస్తాడని సమాచారం. ఐతే కథ మాత్రం చాలా వరకు రాజకీయాల నేపథ్యంలోనే సాగుతుందట. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నించే కొరటాల ‘భరత్ అనే నేను’లో ఇంకా గొప్ప సందేశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.