Begin typing your search above and press return to search.

మ‌హేష్ హిట్ మూవీకి 14ఏళ్లు

By:  Tupaki Desk   |   18 Aug 2018 11:00 PM IST
మ‌హేష్ హిట్ మూవీకి 14ఏళ్లు
X
మ‌హేష్ కెరీర్‌లో ఎన్నో హిట్లు - బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్లు - రికార్డ్ హిట్లు ఉన్నాయి. వీటిలో ప్ర‌థామ‌ర్థంలో మురారి - ఒక్క‌డు - పోకిరి చెప్పుకోద‌గ్గ‌వి. మ‌హేష్ మిడిల్ కెరీర్‌ లో కొన్ని వ‌రుస ఫ్లాప్‌ల‌లో న‌టించాడు. ట‌క్క‌రిదొంగ‌ - బాబి - నిజం - నాని ఇలా కొన్ని ఫ్లాపులు ఊపిరాడ‌నివ్వ‌లేదు. మ‌ధ్య‌లో ఒక్క‌డు ఆదుకున్నా.. ఆ వెంట‌నే రెండు డిజాస్ట‌ర్లు. నిజం - నాని పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చాయి. స‌రిగ్గా అలాంటి వేళ అత‌డిని ఆదుకోవ‌డం కోస‌మేనా? అన్న‌ట్టు ఓ సినిమా వ‌చ్చింది. అదే అర్జున్.

అప్ప‌ట్లో సిస్ట‌ర్ సెంటిమెంటుతో వ‌చ్చిన ఈ చిత్రం సైలెంట్ హిట్ కొట్టింది. అప్ప‌టికి తెలుగు జ‌నం ఇంకా సెంటిమెంటల్ ఫెలోస్‌ గానే ఉన్నారు. నాటి రోజుల్లో ఇప్ప‌టితో పోలిస్తే అన్న‌ద‌మ్ములు - అక్క‌జెల్లెళ్ల మ‌ధ్య అనుబంధాలు బ‌లంగా ఉండేవి. అందుకే ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియెన్ వోన్ చేసుకుని ఆద‌రించారు. కొన్ని ఫ్లాపుల మ‌ధ్య ఒక హిట్టు రావ‌డంతో మహేష్ ఊపిరి పీల్చుకున్నాడు.

ఇప్ప‌టికి అర్జున్ సినిమా రిలీజై 14 సంవ‌త్స‌రాలైంది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 18.08.2004లో రిలీజైంది. మ‌హేష్ స‌ర‌స‌న శ్రీ‌య క‌థానాయిక‌గా న‌టిస్తే, కీర్తిరెడ్డి సోద‌రి పాత్ర‌లో న‌టించారు. ప్ర‌కాష్‌రాజ్ కీల‌క పాత్ర పోషించారు. మ‌ధుర‌మీనాక్షి దేవాల‌యం సెట్ సినిమాకి ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. 9 కేంద్రాల్లో 100రోజులు ఆడిందీ సినిమా. హైద‌రాబాద్ - సంధ్య 35ఎంఎం - వైజాగ్ -జ్యోతి - విజ‌య‌వాడ - అన్న‌పూర్ణ‌ - కాకినాడ‌- దేవి - చీరాల - సాయి - తెనాలి- ర‌త్న‌ - ఏలూరు- అంబిక‌ - అమ‌లాపురం- వెంక‌ట‌ర‌మ‌ణ‌ - బండారు - శ్రీ‌కృష్ణ‌.. థియేట‌ర్ల‌లో అర్జున్ సినిమా శ‌త‌దినోత్స‌వం పూర్తి చేసుకుంది. ఆ విష‌యాన్ని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు షేర్ చేసి సంబ‌రాలు చేసుకుంటున్నారు.