Begin typing your search above and press return to search.

కృష్ణ ఫ్యాన్స్ ఇంటికొచ్చి కొడతారన్న మహేష్

By:  Tupaki Desk   |   18 April 2018 11:27 PM IST
కృష్ణ ఫ్యాన్స్ ఇంటికొచ్చి కొడతారన్న మహేష్
X
తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో అందరికంటే ఎక్కువ ప్రయోగాలు చేసిన ఘనత మహేష్ బాబుదే అంటూ ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కితాబిచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా కెరీర్ ఆరంభం నుంచి కొత్తదనం ఉన్న సినిమాలే చేస్తూ వస్తున్నాడు మహేష్. ఈ క్రమంలో అతను చాలా ఎదురు దెబ్బలు కూడా తిన్నాడు. అయినా వెరవకుండా డిఫరెంట్ రూటులోనే వెళ్తున్నాడు. మహేష్ కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ కూడా భిన్నంగానే కనిపిస్తోంది. కానీ ఇకపై తాను రిస్క్ తీసుకోనని మహేష్ తేల్చి చెప్పడం విశేషం. ఇకపై అభిమానులు కోరుకునే సినిమాలే చేస్తానని మహేష్ స్పష్టం చేశాడు.

ప్ర‌యోగాలు చేసీ చేసీ అల‌సిపోయా. ఇక మీద‌ట కూడా చేస్తే నాన్న‌గారి అభిమానులు ఇంటికొచ్చి మ‌రీ కొడ‌తారు. ఇక మీద‌ట క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తా. చాలా సినిమాల్లో నా పాత్రల విషయంలో ప్రయోగాలు చేశాను. నేరుగా చెప్తున్నాను… ఇకపై నా అభిమానులు నన్ను ఎలాంటి సినిమాల్లో అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాలే చేస్తాను’’ అని మహేష్ స్పష్టం చేశాడు. అభిమానుల కోసం సినిమాలు చేస్తానంటూనే.. అభిమానుల తీరు కూడా మారాలని మహేష్ సూచించాడు. ఓ హీరో సినిమా విడుద‌లైతే మిగిలిన హీరోల అభిమానులు దాన్ని కింద‌కి లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నారని.. ఇది సినిమాకి మంచిది కాదని.. అలాంటి అభిమానులంతా మారాల్సిన అవ‌స‌రం ఉందని మహేష్ అభిప్రాయపడ్డాడు.