Begin typing your search above and press return to search.

కాశీలో మహేష్‌ ప్రేమ కథ అన్నట్లుంది

By:  Tupaki Desk   |   10 March 2016 3:59 AM GMT
కాశీలో మహేష్‌ ప్రేమ కథ అన్నట్లుంది
X
మామూలుగా మనోళ్ళు కాశీ వెళ్లి ఏం షూట్‌ చేస్తారు చెప్పండి? అయితే పరమశివుడి సన్నిధానం అందరికీ గుర్తుండేలా నాలుగు సీన్లు.. లేకపోతే ఎవరైనా ఒక సూపర్ మాస్‌ హీరోకి ఒక సాధుజీవితంతో కూడా ఫ్లాష్‌ బ్యాక్‌. లేకపోతే పవన్‌ కళ్యాణ్‌ వంటి హీరోలు అక్కడే ప్రేమ కథలు కూడా తీస్తుంటారు. సడన్‌ గా ఇప్పుడు కాశీ గురించి ఈ స్థల పురాణం ఎందుకనేగా మీ ప్రశ్న.. అక్కడికే వస్తున్నాం.

ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా కూడా.. కాశీలో వీక్షకుల కెమెరాలకు చిక్కిన మహేష్‌ బాబు అండ్‌ సమంత స్టిల్స్‌ తెగ కనిపిస్తున్నాయి. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో కాశీలో చాలా సీన్లు తీసుకొని.. ఇప్పుడు యునిట్‌ ఉదయపూర్‌ కు మూవ్‌ అయ్యింది. అయితే కాశీలో షూట్‌ చేసిన తాలూకు ఫోటోలు చూస్తే మాత్రం.. ఒక విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మోడ్రన్‌ డ్రస్సుల్లో ఉన్న సమంత.. టాప్‌ లెస్‌ కారులో వచ్చిన మహేష్‌.. ఇలాంటివన్నీ చూస్తుంటే.. అసలు కాశీలో శ్రీకాంత్‌ ఏం షూట్‌ చేస్తున్నాడు అనే సందేహం వస్తోందా రావట్లేదా?

ఖచ్చితంగా వస్తుంది. చూస్తున్న విషయాలను కాస్త అనలైజ్‌ చేస్తే.. మనోడు అక్కడ ఈ పెయిర్ పై ఒక చక్కటి లవ్‌ స్టోరీ ఏదో తీస్తున్నాడని అనిపిస్తోంది. పైగా వేరే నటులంటే కేవలం వెన్నెల కిషోర్‌ ఒక్కడే కనిపిస్తున్నాడు. సర్లేండి.. సినిమా రిలీజయ్యాక వీరు ఏం షూట్‌ చేశారో తాపీగా తెలుసుకొని అప్పుడు మాట్లాడుకుందాం.