Begin typing your search above and press return to search.
మహేష్ శ్రద్దకు చరణ్ కృతజ్ఞతలు
By: Tupaki Desk | 30 Dec 2020 11:27 AM ISTరామ్ చరణ్ ఇటీవలే కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. కరోనా లక్షణాలు ఏమీ లేకపోవడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఇటీవలే రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. చరణ్ కు కరోనా అంటూ ట్వీట్ చేయగానే లక్షలాది మంది మెగా ఫ్యాన్స్ స్పందించారు. త్వరగా రికవరీ అవ్వాలంటూ ప్రార్థించారు. చరణ్ ఆరోగ్యం విషయమై మహేష్ బాబు స్పందించాడు. జాగ్రత్తగా ఉండు చరణ్.. నీవు చాలా స్పీడ్ గా కరోనా నుండి కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
మహేష్ బాబు ట్వీట్ కు చరణ్ వెంటనే స్పందించాడు. మీరు నా గురించి శ్రద్ద చూపించినందుకు కృతజ్ఞతలు మహేష్ అంటూ రీ ట్వీట్ చేశాడు. వీరిద్దరి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్టార్ హీరోలైన వీరు మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే. పలు సందర్బాల్లో వీరు కలిసి పార్టీలు చేసుకున్న సందర్బాలు ఉన్నాయి. మెగా వర్సెస్ మహేష్ ఫ్యాన్స్ అన్నట్లుగా సోషల్ మీడియాలో ఎప్పుడు వార్ జరుగుతు ఉంటుంది. ఇలాంటి సమయంలో వీరిద్దరు ఇలా ఒకరిపై ఒకరు శ్రద్ద చూపించుకుంటూ ట్వీట్ చేసుకోవడం చాలా బాగుందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు ముచ్చటించుకుంటున్నారు.