Begin typing your search above and press return to search.

ఇక్కడికి మహేష్‌.. అక్కడికి పవన్‌..

By:  Tupaki Desk   |   18 Sept 2015 10:16 AM IST
ఇక్కడికి మహేష్‌.. అక్కడికి పవన్‌..
X
అక్కినేని వంశంలోని లేటెస్ట్ వారసుడు నాగ్ తనయుడు అఖిల్ నటించిన అఖిల్ మూవీ.. రిలీజ్ కి ముందే ఎన్నో అద్భుతాలను సాక్షాత్కరిస్తోంది. టాలీవుడ్ టాప్ స్టార్లు ఇద్దరినీ ఈ మూవీ కోసం ఒకే వేదిక పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. ఈ నెల 20న అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఆడియో ఫంక్షన్ కు.. మహేష్ - పవన్ లను ఆహ్వానించారట.

అయితే అటెండ్ అయ్యేందుకు సూపర్ స్టార్ హామీ ఇచ్చినా.. పవర్ స్టార్ మాత్రం లైట్ తీస్కోమన్నాడట. దీంతో ఆడియో వేడుకకు మెయిన్ గెస్ట్ మహేష్ ఒక్కడే. కానీ పవన్ కి పెద్ద ఫ్యాన్ అయిన అఖిల్ నిర్మాత నితిన్ మాత్రం.. పవర్ స్టార్ ని వదిలిపెట్టడం లేదు. ఎలాగైనా సరే.. ఈ మూవీ పబ్లిసిటీలో పవన్ ని భాగం చేయాలన్నది నితిన్ ఆలోచన. అందుకే కొన్ని రోజుల తర్వాత వైజాగ్ లో ఆడియో సక్సెస్ మీట్ నిర్వహిస్తామని, దీనికి మాత్రం ఖచ్చితంగా రావాలని.. పవన్ పై ప్రెజర్ తీసుకొస్తున్నాడట.

పవన్ నుంచి హామీ ఏం లభించిందో తెలియదు కానీ.. అఖిల్ ఆడియోకి సంబంధించి రెండు వేడుకులకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. హైద్రాబాద్ లో జరిగే ఫంక్షన్ కి మహేష్ ముఖ్య అతిథి అయితే... వైజాగ్ లో జరిగే వేడుకలో పవన్ అట్రాక్షన్ అని ప్రచారం సాగుతోంది. అఖిల్ లాంఛింగ్ మూవీని సెన్సేషన్ చేసేందుకు అన్ని మార్గాలను పక్కాగా ఫాలో అయిపోతున్నాడు నిర్మాత నితిన్.