Begin typing your search above and press return to search.
మహేష్ పాజిటివిటీ.. పవన్ నెగెటివిటీ
By: Tupaki Desk | 3 Oct 2015 4:00 AM ISTటాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా కొనసాగుతున్నారు పవన్ - మహేష్. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరి గురించిన ఓ కంపారిజన్ ఫిలింనగర్ లో డిష్కసన్ పాయింట్ అయ్యింది. మహేష్ పాజిటివ్ సైడ్ దూసుకుపోతుంటే.. పవన్ నెగెటివ్ టాక్ తెచ్చుకుంటున్నాడు అన్నట్టే ఉంది ఈ డిష్కసన్.
పవన్ జనసేన పార్టీ పెట్టాడు. ప్రజల కోసం ఏదైనా చేస్తా. ప్రజల తరపున ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తా. కానీ ఈ మాటను నిలబెట్టుకోవడంలో పవన్ పూర్తిగా విఫలమయ్యాడని విమర్శలు వస్తున్నాయి. పవన్ వల్ల ఓ పార్టీ అధికారంలోకి వచ్చిందే తప్ప ప్రజలకు మేలు జరగలేదు అన్న విమర్శలొచ్చాయి. తమిళనాడులో తెలుగోళ్ల గురించి పోరాడతానని వెనుదిరిగాడనే విమర్శను కొత్తగా ఎదుర్కొంటున్నాడు. అలాగే సినిమాల్లో నటించకుండా ప్రాజెక్టులు డిలే చేస్తూ.. కొత్త కొత్త రైటర్లను దించుతూ సర్దార్ ను ముందుకెళ్ళకుండా చేస్తూ.. అభిమానులనూ హర్టు చేస్తున్నాడు. మెగాస్టార్ 60వ పుట్టినరోజు వేడుకలకు ఆలస్యంగా వచ్చి మరో వివాదానికి దారి తీశాడు. ఇలా ఏ కోణంలో చూసినా పవన్ నెగెటివ్ గా కనిపిస్తున్నాడు.
అయితే సేమ్ టైమ్ మహేష్ మహోన్నతుడు అని పేరు తెచ్చుకున్నాడు. అతడు నటించిన శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్టయ్యింది. ఆ సినిమా ప్రభావంతో గ్రామాల్ని దత్తత తీసుకునేందుకు ధనవంతులంతా ముందుకొస్తున్నారు. పైగా మహేష్ సినిమాలో ఏం చెప్పాడో అదే బైట కూడా చేసి చూపించాడు. తెలంగాణ - ఏపీలో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ రెండిటికి అన్ని వసతుల్ని కల్పించేందుకు నడుం కట్టాడు. ఇలా పాజిటివిటీని ఎక్కువగా ప్రసరిస్తుంటే.. పవన్ మాత్రం కాస్త నెగెటివ్ టచ్ ఇస్తున్నాడు. సర్లేండి.. ఏదైనా ఒక్క సింగిల్ ఈవెంట్ తో చరిత్ర మారిపోయిన సంఘటనలు అనేకం. దానిక కోసం వెయిట్ చేద్దాం మరి.