Begin typing your search above and press return to search.
వావ్.. మరో టాలెంట్ చూపిన లిటిల్ ప్రిన్సెస్ సితార
By: Tupaki Desk | 21 Sept 2020 12:40 PM ISTమహేష్ బాబు డాటర్ సితార బహుముఖ ప్రజ్ఞాశాలి. చక్కగా డ్యాన్స్ వేయగలదు. మాట్లాడగలదు. ఇంత చిన్న వయసులోనే ఏకంగా ఓ యూట్యూబ్ ఛానెల్ నే రన్ చేస్తోంది.. ఆ చిన్నారి. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురి ఆద్యతో కలసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఏకంగా తన తండ్రి మహేష్ బాబునే ఇంటర్వ్యూ చేసింది. ఇప్పుడు తాజాగా మరో నైపుణ్యాన్ని సితార వెలికి తీసింది. తన తల్లిదండ్రులు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల ఫోటో తీసింది. మహేష్ కి పిల్లంటే ఎంతో ఇష్టం. షూటింగ్ కి కాస్త విరామం వస్తే చాలు పిల్లల దగ్గర వాలిపోతుంటాడు. చిన్న పిల్లాడిలా వారితో కలసి ఆడుకుంటూ ఉంటాడు. ఇక సితార బహుముఖ నైపుణ్యం పై పొంగిపోతుంటారు. తాజాగా నమ్రతా శిరోద్కర్ ప్రిన్స్ మహేశ్ బాబు తో కలసి ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఈ ఫొటోలో మహేశ్, నమ్రత ఇద్దరూ ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోను తన కూతురు, లిటిల్ ప్రిన్స్ సితార తీసిందని నమ్రతా పేర్కొన్నారు. ఇంకా నమ్రత దీనిపై మరిన్ని విషయాలు పంచుకున్నారు. ‘మన ఉనికికి మూలం ప్రేమే. కేవలం ప్రేమ, అప్యాయతలు ఉన్నప్పుడు మాత్రమే మనం జీవితాన్ని ఎంతో అందంగా ఆ స్వాదించగలం. మనలో ఉండే దయ, తాదాత్మ్యం, కరుణ వంటి గొప్పగుణాలన్నీ ప్రేమ అనే ఉద్వేగం నుంచే పుట్టుకొస్తాయి. మనం మరింత ఉన్నతంగా కనిపించడానికి.. మన మనసు పరిపక్వత చెందడానికి ప్రేమ ఓ కారణం. కాబట్టి మనమంతా చిన్నచిన్న అభిప్రాయ బేధాలను పక్కన బెట్టి అందరూ ఎంతో ప్రేమగా ఉండాలి’ అంటూ ఆమె పేర్కొన్నారు. నమ్రత చేసిన ఈ పోస్టు ఫోటో తో పాటు ఆమె చేసిన కామెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.