Begin typing your search above and press return to search.

ఇంత‌లోనే ముంబైలో ప్ర‌త్య‌క్ష‌మైన రొమాంటిక్ క‌పుల్

By:  Tupaki Desk   |   9 Dec 2020 9:37 AM IST
ఇంత‌లోనే ముంబైలో ప్ర‌త్య‌క్ష‌మైన రొమాంటిక్ క‌పుల్
X
న‌చ్చిన స‌ఖిని ప్రేమించి పెళ్లాడితే త‌ప్పేం ఉంది. పెళ్లయ్యాక రొమాంటిక్ డిన్న‌ర్ లకు వెళ్ల‌క‌పోతేనే ము‌ప్పు. కానీ ఇలా ఫ్యామిలీ మ్యాట‌ర్స్ లో ఎలాంటి డోఖా లేకుండా విలువైన‌ టైమ్ స్పెండ్ చేయ‌డంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ అంద‌రికీ స్ఫూర్తినిస్తుంటారు.

మహేష్ - నమ్రతా శిరోద్కర్ ప్రేమ వివాహం ప్రేమికులంద‌రిలో స్ఫూర్తి నింపుతుంది. ఈ జంట ఎప్ప‌టిక‌ప్పుడు రొమాంటిక్ డేట్ అంటూ దేశ విదేశాల్లో ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళుతుంటారు. కుటుంబ స‌మేతంగా విదేశీ ప్ర‌యాణాల‌కు అయితే కొద‌వేమీ లేదు. ఇటీవ‌లే దుబాయ్ వెళ్లి వ‌చ్చారు.

ఇంత‌లోనే ఇప్పుడు ముంబైలో రొమాంటిక్ డేట్ ను ఆస్వాధిస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం తన భార్య నమ్రతా శిరోద్కర్ పిల్లలతో ముంబైలో ఉన్నారు. ముంబైలో ఆన్ స్పాట్ నుంచి తాజా ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి అభిమానుల్లో వైర‌ల్ గా మారాయి.

తాజా రొమాంటిక్ డేట్ విష‌యంలో తన భర్తతో గడిపే స‌మ‌యం చిక్కినందుకు నమ్రత చాలా సంతోషంగా ఉన్నారు. ‘జస్ట్ యు ఎన్ మి’ అనే క్యాప్ష‌న్ ని తాజా ఫోటోకి ఇచ్చారు.

మహేష్ -నమ్రతా శిరోద్కర్ వివాహం చేసుకుని 15 సంవత్సరాలు అయ్యింది. వార‌సులు గౌత‌మ్- సితార పెద్ద పిల్ల‌లుగా ఎదిగేస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో ఈ స్టార్ కిడ్స్ కి ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణం. ఇక మ‌హేష్ తన వ్యక్తిగత వృత్తి జీవితాన్ని సమతుల్యం చేసుకునే విధానంలో `సరిలేరు నీకెవ్వ‌రు` అంటూ అభిమానుల నుంచి ప్ర‌శంసలు పొందుతారు. మ‌హేష్ కి పరిపూర్ణ ఫ్యామిలీ మ్యాన్ గా గుర్తింపు ఉంది.

మ‌హేష్‌ ప్రస్తుతం తన తదుపరి చిత్రం సర్కారు వారి పాట చిత్రీక‌ర‌ణ‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇందులో మ‌హేష్ ఓ వైవిధ్య‌మైన‌ పాత్రను పోషించ‌నున్నారు.