Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మహేష్‌ పై నమ్రత ముద్దుల దాడి

By:  Tupaki Desk   |   10 Feb 2023 3:32 PM GMT
పిక్ టాక్ : మహేష్‌ పై నమ్రత ముద్దుల దాడి
X
టాలీవుడ్‌ లోనే మోస్ట్ బ్యూటీఫుల్‌ జోడీ అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు వరుసలో ఉండే జంట మహేష్ బాబు.. నమ్రత అనడంలో సందేహం లేదు. వీరిద్దరూ కలిసి నటించి ఆ సమయంలో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు నేడు 18వ వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్నారు.

ఈ ప్రత్యేకమైన రోజున మహేష్ బాబు ఇన్ స్టా లో నమ్రతతో ఉన్న పాత ఫొటోను షేర్‌ చేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక నమ్రత శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అనే విషయం తెల్సిందే. ఆమె మ్యారేజ్ డే సందర్భంగా ఈ ఫొటోను షేర్‌ చేసింది.

చాలా సంవత్సరాల క్రితం ఫొటో అయ్యి ఉంటుంది. మహేష్ బాబు చాలా చిన్నగా గౌతమ్‌ మాదిరిగా కనిపిస్తున్నాడు. మహేష్‌ బాబు పై పడి ముద్దుల్లో నమ్రత ముంచెత్తుతోంది. ఈ ఫొటో ఇద్దరి మధ్య ఉన్న బాండిండ్‌ మరియు ప్రేమకు ప్రతి రూపం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎల్లప్పుడు ఇలాగే సంతోషంగా మీ జంట ఉండాలంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. వీరిద్దరి కాంబో సినిమా కోసం ప్రేక్షకులు పుష్కర కాలంగా వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు కాంబో రిపీట్‌ అయ్యింది. ఇదే ఏడాది ఆగస్టు వరకు సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఉంటుందనే విషయం తెల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.