Begin typing your search above and press return to search.

ఫోటోలో మహేష్ వెనకే.. ఎన్ని అర్ధాలో

By:  Tupaki Desk   |   16 Jan 2017 1:08 PM GMT
ఫోటోలో మహేష్ వెనకే.. ఎన్ని అర్ధాలో
X
ఫోటోషూట్స్ కోసం బోలెడంత ప్లానింగ్స్.. ఇంకెంతో ముందస్తు ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటారు. ఒక ఫొటో అంటే ఒక లైఫ్ టైం మెమరీ కాబట్టి.. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ అనుకోకుండా తీసే ఫోటోలు ఒకోసారి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. తాజాగా మహేష్ బాబు ఫోటో షూట్ విషయంలో ఇదే జరిగింది.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాక్ గోవార్కర్.. తాజాగా మహేష్ బాబతో ఓ ఫోటో షూట్ చేశాడు. కార్పొరేట్ కంపెనీలకు ఫోటో షూట్స్ చేసే ఈయన.. తాజాగా మహేష్ ఫోటో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 'ప్యాకప్ కూడా పూర్తయిపోయిన తర్వాత.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆయన ప్రియమైన భార్య.. నా స్నేహితురాలు నమ్రతా శిరోద్కర్.. ఇలా ఫోటోకు చిక్కారు' అంటూ ఓ ఫోటో పోస్ట్ చేశాడు. దీనిలో మహేష్ బాబు ఎంతో హ్యాండ్సమ్ గా నవ్వుతూ కనిపిస్తుంటే.. వెనకాల నమ్రతా శిరోద్కర్ అస్పష్టంగా కనిపిస్తుంది.

ప్రస్తుతం మహేష్ చేసే ప్రతీ డీల్ వెనకా.. సినిమా వెనకా.. ప్రమోషన్స్ వెనకా.. చివరకు ట్విట్టర్ పోస్టింగ్స్ వెనక.. ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో షేరింగ్స్ వెనక కూడా నమ్రత హ్యాండ్ ఉంటోందన్న మాట వింటూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ముందు అందంగా మహేష్.. వెనకాల అస్పష్టంగా కనిపిస్తున్న నమ్రత ఫోటో.. వారి లైఫ్ కి దగ్గరగా ఈ ఫోటో అనిపించడం లేదూ!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/