Begin typing your search above and press return to search.
మహేష్ సినిమా.. ఇంట్రెస్టింగ్ అప్ డేట్
By: Tupaki Desk | 13 Dec 2016 11:00 PM IST‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హిట్టు కొట్టాల్సిన స్థితిలో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ తర్వాతి సినిమాకు మురుగదాస్ దర్శకుడు కావడంతో అభిమానులు చాలా కాన్ఫిడెంటుగా ఉన్నారు. మురుగ ఆషామాషీ సినిమాలు తీయడు. అతడి నుంచి ఏవరేజ్ సినిమాలు వచ్చాయి కానీ.. ఫ్లాపులు అరుదు. మహేష్ కోసం చాన్నాళ్లు వెయిట్ చేసి.. స్క్రిప్టు మీద కూడా చాలా టైం పెట్టిన నేపథ్యంలో సినిమా కచ్చితంగా బాగుంటుందన్న అంచనాలున్నాయి. తనదైన స్టయిల్లో మహేష్ కోసం మురుగదాస్ సరికొత్త కథతో వస్తాడని ఆశిస్తున్నారంతా.
ఐతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ మరీ అంత కొత్తగా ఏమీ ఉండదంటున్నారు. టెస్టెడ్ అండ్ సక్సీడ్ ఫార్ములాతోనే మహేష్ కోసం కథ రెడీ చేశాడట మురుగ. ఇది ఒకరు మంచోడు.. ఇంకొకరు చెడ్డవాడు అయిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య సాగే పోరాటం నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. మరి మహేష్ బ్రదర్ గా నటిస్తున్నదెవరో తెలియాల్సి ఉంది. కథ కొంచెం పాతదే అయినా.. కథనం మురుగాదాస్ స్టయిల్లో ఇంటెన్సిటీతో సాగుతుందట. ఈ చిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. మరో తమిళ నటుడు భరత్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరిలో పూర్తవుతుంది. జనవరి 1న ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ మధ్యలో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/