Begin typing your search above and press return to search.

మ‌హేష్ వ‌ల్ల నా భార్య‌తో గొడ‌వ‌:కేటీఆర్

By:  Tupaki Desk   |   28 April 2018 2:01 PM GMT
మ‌హేష్ వ‌ల్ల నా భార్య‌తో గొడ‌వ‌:కేటీఆర్
X
`భ‌ర‌త్ అనే నేను` సినిమా స‌క్సెస్ మీట్ లో భాగంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, విల‌క్ష‌ణ దర్శకుడు కొరటాల శివలతో క‌లిసి `విజ‌న్ ఫ‌ర్ ఎ బెట‌ర్ టుమారో` అనే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఆ కార్య‌క్రమంలో భాగంగా మ‌హేష్, కేటీఆర్ లు త‌మ మ‌న‌సు విప్పి మాట్లాడారు. ఆ సినిమా చేసిన త‌ర్వాత త‌న‌కు రాజ‌కీయాల ప‌ట్ల మ‌రింత అవ‌గాహ‌న వ‌చ్చింద‌ని, ఒక రాజ‌కీయ‌వేత్త‌గా కేటీఆర్ కు ఎన్ని బాధ్య‌త‌లుంటాయో, ఎంత‌ క‌ష్ట‌ప‌డుతున్నారో అర్థ‌మైంద‌ని మ‌హేష్ అన్నారు. త‌న‌ చిన్న‌త‌నం నుంచి నాన్న‌గారు రాజ‌కీయాల్లో ఉన్నార‌ని, ఆయ‌న‌ ఎందుకు త‌న‌తో స‌మ‌యం గ‌డ‌ప‌లేద‌న్న విష‌యం త‌న‌కు చిన్న‌పుడు అర్థ‌మయ్యేది కాద‌ని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ విష‌యం అర్థ‌మైంద‌ని, కుటుంబం కన్నా స‌మాజం కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌డం వ‌ల్లే త‌న పిల్ల‌ల‌తో కూడా త‌క్కువ స‌మ‌యం గడుపుతున్నాన‌ని కేటీఆర్ అన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ఇదే విష‌యాన్ని `భ‌ర‌త్ అనే నేను` సినిమాలో శ‌ర‌త్ కుమార్, మ‌హేష్, అత‌డి త‌మ్ముడి మ‌ధ్య చ‌క్క‌గా చూపించార‌న్నారు. భ‌విష్య‌త్తులో ఏదో ఒక‌రోజు త‌న పిల్ల‌ల‌కు కూడా త‌న‌ను అర్థం చేసుకొని త‌న‌కు ఆ క్రెడిట్ ఇస్తారని అనుకుంటున్నట్లు కేటీఆర్ అన్నారు. మ‌హేష్ వ‌ల్ల త‌మ ఇంట్లో ఒక‌టే గొడ‌వ జ‌రుగుతోంద‌ని కేటీర్ చ‌మ‌త్క‌రించారు. ప్ర‌తి సినిమా త‌ర్వాత త‌న ఫ్యామిలీతో క‌లిసి మ‌హేష్ హాలిడేకు వెళ‌తార‌ని, ఆ హాలిడే ట్రిప్ ఫొటోల‌ను న‌మ్ర‌త సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తోంద‌ని.....నువ్వెందుకు తీసుకెళ్ల‌వు అని త‌న భార్య ఒక‌టే గొడ‌వ చేస్తోంద‌ని కేటీఆర్ సెటైర్ వేయ‌డంతో అక్క‌డున్న‌వారంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. కేటీఆర్ వ్యాఖ్య‌ల‌కు మ‌హేష్ కూడా త‌న‌దైన శైలిలో పంచ్ వేశారు. త‌న జాబ్ క‌న్నా కేటీఆర్ జాబ్ పెద్ద‌ద‌ని...అందుకే హాలిడేల‌కు వెళ్ల‌డం కుద‌ర‌డం లేద‌ని అన్నారు. దానికి స్పందించిన కేటీఆర్.....త‌న జాబ్ పెద్ద‌ద‌ని ఇక్క‌డున్న వారు ఎవ‌రూ అనుకోవ‌డం లేద‌ని మ‌రో సెటైర్ వేసి అంద‌రినీ న‌వ్వించారు.