Begin typing your search above and press return to search.

మహేష్ +కొరటాల= 39 కోట్లు

By:  Tupaki Desk   |   21 July 2016 5:00 PM IST
మహేష్ +కొరటాల= 39 కోట్లు
X
ఏంటీ లెక్క అంటారా.. అదేనండీ తమ కాంబినేషన్లో రాబోయే కొత్త సినిమాకు వీళ్లిద్దరూ తీసుకోబోయే పారితోషకాల లెక్క. టాలీవుడ్లో ఏ హీరో తీసుకోనంత మహేష్ బాబు.. ఏ డైరెక్టర్ తీసుకోనంత కొరటాల శివ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. మహేష్ బాబు రికార్డు స్థాయిలో రూ.25 కోట్లు అందుకోబోతున్నాడు. కొరటాలకు రూ.14 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అంటే వీళ్లిద్దరి పారితోషకాలే రూ.39 కోట్లవుతున్నాయి. ఓ భారీ బడ్జెట్ సినిమా తీసేయగల బడ్జెట్ ఇది. ఇద్దరికే ఇంతిచ్చేస్తే.. మిగతా పారితోషకాలు.. సినిమాకు అయ్యే ఖర్చు అంతా కలుపుకుంటే ఈజీగా లెక్క రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు లెక్క తేలే పరిస్థితి కనిపిస్తోంది.

మహేష్ తన గత సినిమా ‘బ్రహ్మోత్సవం’కు రూ.22 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. అది అప్పటికి టాలీవుడ్ రికార్డు రెమ్యూనరేషన్. మురుగదాస్ సినిమాకు కూడా దాదాపుగా ఇంతే పారితోషకం తీసుకుంటున్నాడట మహేష్. ఐతే మురుగ సినిమా తర్వాత మహేష్ మార్కెట్ పెరగడం ఖాయం. ఆ సినిమా తమిళంలో కూడా రిలీజవుతుండటం అడ్వాంటేజీగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత డీవీవీ దానయ్య మహేష్ కు రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. మరోవైపు కొరటాలది కూడా రికార్డు రెమ్యూనరేషనే. సినిమాలో వాటా తీసుకునే రాజమౌళిని పక్కన బెట్టేస్తే.. మిగతా స్టార్ డైరెక్టర్లందరూ అటు ఇటుగా రూ.10 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు. నాలుగో సినిమాకే రూ.14 కోట్లు తీసుకోబోతుండటం మామూలు విషయం కాదు.