Begin typing your search above and press return to search.
మహేష్-కొరటాల అను మేము.. కొనేశాము
By: Tupaki Desk | 27 March 2018 6:36 PM ISTభరత్ అనే నేను సినిమాతో మహేష్ బాబు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా తెరపైన కనపడబోతున్న సంగతి తెలిసిందే. పైగా శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను మనకు అందించిన కొరటాల శివ అండ్ మహేష్ బాబు కాంబోలో ఈ సినిమా వస్తున్న కారణంగా అంచనాలు ఒక రేంజీలో ఉన్నాయి. చూస్తూ ఉంటే ఫాన్స్ కి మాత్రమే కాక కొరటాల - మహేష్ కి కూడా సినెమపైన బోలెడంత నమ్మకం ఉన్నట్టు కనిపిస్తోంది.
ఎంత మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అయినా బోలెడంత హైప్ ను క్రియేట్ చేసి వచ్చిన స్పైడర్ సినిమా దారుణాతి దారుణంగా ప్లాప్ అయ్యి కూర్చుంది. అసలే బ్రహ్మోత్సవం ప్లాప్ నుండే సరిగ్గా కోలుకుని ప్రిన్స్ కు ఇది మరొక ఎదురు దెబ్బ. అటు ఫాన్స్ కూడా ఒక్క హిట్టు కూడా దొరకకపోయేసరికి డీలాపడిపోయారు. అందుకనే బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాలకే తన సినిమా బాధ్యత అప్పగించాడు. భరత్ అనే నేను తో ఒక పొలిటికల్ థ్రిల్లర్ ని తీశాడు కొరటాల. సినిమా ఏప్రిల్ 20న విడుదలకు సిద్దంగా ఉండగా.. టీం అంతా సినిమా చాలా బాగా వచ్చింది అంటూ ఆనందంతో ప్రచారం చేస్తున్నారు. కొరటాల - మహేష్ కూడా సినిమాపై చాలా కాన్ఫిడెంటుగా ఉన్నారట.
అందుకే దర్శకుడు నిజాం ఏరియాలోని రైట్స్ ను సొంతం చేసుకోగా.. మహేష్ కూడా ఎంచక్కా కొన్ని ప్రాంతాలలో థియేట్రికల్ రైట్స్ ను కొనేశాడట. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది అని నమ్మకం లేకపోతే ఎవరు మాత్రం ఇంత ఆసక్తి చూపుతారు చెప్పండి? అందుకే కొరటాల - మహేష్ కు భరత్ అనే నేను పైన అపారమైన నమ్మకం ఉంది అని యునిట్ మెంబర్లు చెప్తున్నారు. చూద్దాం వీరి నమ్మకం ఏమవుతుందో!!