Begin typing your search above and press return to search.

మ‌హేష్ సినిమా లైన్ బ‌య‌టికొచ్చింది

By:  Tupaki Desk   |   8 Sept 2016 1:00 PM IST
మ‌హేష్ సినిమా లైన్ బ‌య‌టికొచ్చింది
X
శ్రీమంతుడు కాంబినేష‌న్‌ లో మ‌రో సినిమా అనేస‌రికి మ‌హేష్ అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. శ్రీమంతుడు సినిమాలో మ‌హేష్‌ ని చూపించిన విధానం - ఆయ‌న పాత్ర‌ని తీర్చిదిద్దిన అభిమానుల‌కి భ‌లే న‌చ్చింది. తాము తెర‌పై మ‌హేష్‌ ని ఎలా చూడాల‌నుకొంటున్నామో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ అలాగే చూపించాడ‌ని సంతోషం వ్య‌క్తం చేశారు అభిమానులు. అందుకే ఇప్పుడు రెండోసారి మ‌హేష్‌- కొర‌టాల శివ కాంబో సెట్ట‌య్యేస‌రికి ఒక్క‌సారి అంచ‌నాలు పెరిగిపోయాయి. అయినా స‌రే, కొర‌టాల మాత్రం త‌న లైన్ అంచ‌నాల్ని అందుకొనేలాగే ఉంటుంద‌ని కాన్ఫిడెంట్‌ గా చెబుతున్నాడు. అదొక పెద్ద స‌బ్జెక్టు అని - మ‌హేష్ అందులో మ‌రింత స్టైలిష్‌ గా క‌నిపించ‌బోతున్నాడ‌ని ఇటీవ‌ల మీడియాతో చెప్పుకొచ్చారు.

అయితే ఆ స‌బ్జెక్ట్ ఏంట‌న్న‌ది మాత్రం ఆయ‌న బ‌య‌టికి చెప్ప‌లేదు. తాజాగా బ‌య‌టికొచ్చిన స‌మాచారం మేర‌కు ఆ స‌బ్జెక్ట్ `నిన్ను నువ్వు ప్రేమించుకో` అనే అంశమే అని తెలిసింది. ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలామంది వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆస్వాదించ‌లేక‌పోతున్నారు, ఓ ప్ర‌వాహంలో కొట్టుకుపోతున్న‌ట్టుగా జీవిస్తున్నారు. అదే అంశాన్ని ఆస‌రాగా చేసుకొనే కొర‌టాల త‌న‌దైన శైలిలో క‌థ రాశాడ‌ట‌. అందులో హీరోయిజంతో పాటు - ఎంట‌ర్‌ టైన్‌ మెంట్‌ - మంచి సందేశం కూడా ఉంటుందట‌. కొర‌టాల ఏ సినిమా తీసినా అందులో సందేశం త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది, కానీ అది సందేశ‌మిచ్చిన‌ట్టుగా మాత్రం ఉండ‌దు. సినిమా క‌థ‌లోనే ఆ సందేశాన్ని క‌లిపేస్తుంటారు. అక్క‌డే ఆయ‌న‌లో సత్తా క‌నిపిస్తుంటుంది. మ‌హేష్‌ తో తెర‌కెక్కించ‌నున్న సినిమాని కూడా అదే ఫార్మాట్‌ లోనే ఉంటుందని తెలిసింది. మ‌హేష్ సినిమా బ‌య‌టికొచ్చాక ప్ర‌తి ఒక్క‌రూ ల‌వ్ యువ‌ర్ సెల్ఫ్... అంటూ జీవితాల్ని గ‌డిపేస్తారేమో చూడాలి.