Begin typing your search above and press return to search.

మహేష్ మూవీ.. దసరానే ముహూర్తం

By:  Tupaki Desk   |   9 Nov 2016 11:00 PM IST
మహేష్ మూవీ.. దసరానే ముహూర్తం
X
మహేష్ బాబు కొత్త సినిమా మొదలైపోయింది. ప్రస్తుతం మురుగదాస్ తో సినిమా చేస్తున్న సూపర్ స్టార్.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం పూజా పునస్కారాలు కానిచ్చేసి.. ముహూర్తం షాట్ కూడా తీసేశారు. అయితే.. ముహూర్తం షాట్ విషయంలో హాజరు కాకూడదని మహేష్ కు సెంటిమెంట్ ఉంది కాబట్టి.. ఆయన భార్య నమ్రత ఈ కార్యక్రమంలో పాల్గొంది.

నవంబర్ తొలివారంలోనే ముహూర్తం పెట్టించుకున్నా.. ఈ మూవీ మొదలయ్యేది మాత్రం జనవరి నెల చివరిలోనే. మురుగదాస్ సినిమా షూటింగ్ ను పూర్తిగా కంప్లీట్ చేశాక.. కొరటాలతో కలుస్తాడు సూపర్ స్టార్. దిల్ చాహ్తా హై.. రంగ్ దే బసంతి వంటి చిత్రాలకు కెమేరా సేవలు అందించిన సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్.. కొరటాల-మహేష్ తో కలిసి వర్క్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు తెరపైకి తీసుకురానున్నారని అంటున్నారు. సెప్టెంబర్ చివర్లో దసరా పండుగ రానుండగా.. ఆ సమయానికల్లా మహేష్ బాబు- కొరటాల శివల మూవీ.. థియేటర్లలో ఉటుందట.

ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్ ను ఫైనలైజ్ చేయలేదు కానీ.. ప్రస్తుతం ఫ్రెష్ కాంబినేషన్ కోసం సెర్చింగ్ జరుగుతోంది. రటాల తీయనున్న సినిమాలో.. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తుండగా.. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/