Begin typing your search above and press return to search.
మహేష్ డుమ్మా కొట్టేశాడుగా..
By: Tupaki Desk | 9 Nov 2016 3:32 PM ISTమహేష్ బాబు సినిమా ఒకటి సెట్స్ మీద ఉండగా.. ఇంకో సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. గత దశాబ్ద కాలంలో దాదాపు ఇలా జరగనే లేదు. ఐతే ఇప్పుడు మురుగదాస్ సినిమా షూటింగ్ జరుగుతుండగానే కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతే కాదు.. ఆ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది.
ఇవాళ రామానాయుడు స్టూడియోలో పెద్దగా హంగామా లేకుండా సింపుల్ గా మహేష్-కొరటాల సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఆశ్చర్యకరంగా ఈ కార్యక్రమానికి మహేష్ డుమ్మా కొట్టాడు. ముందు మహేష్ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు. మహేష్ సతీమణి నమ్రత పూజలో పాల్గొంది. దర్శకుడు కొరటాల శివ.. నిర్మాత డీవీవీ దానయ్య.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లతో పాటు సురేష్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ప్రారంభోత్సవం ఈ రోజు జరుపుకున్నా.. షూటింగ్ మొదలవడానికి టైం పడుతుంది. రెండు నెలల తర్వాత జనవరిలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది. ఈ చిత్రానికి ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ‘శ్రీమంతుడు’ తరహాలోనే ఇది కూడా సామాజికాంశాలతో ముడిపడ్డ కమర్షియల్ ఎంటర్టైనర్ అని సమాచారం. దీని బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లట. ఇంకా ఈ చిత్రానికి కథానాయికను ఖరారు చేయలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/