Begin typing your search above and press return to search.
సెంచరీ దాటిస్తున్న మహేష్
By: Tupaki Desk | 28 Aug 2017 11:12 AM ISTతెలుగు సినిమా రంగం రేంజ్ మారిపోతోంది. బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అన్నట్లుగా పరిస్థితి మారిపోతోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో లెక్కలు హఠాత్తుగా తేడా వచ్చేశాయి. మొన్న మొన్నటి వరకూ తెలుగు 100 కోట్ల రూపాయల షేర్ రాబట్టడం అంటేనే గగనం. సినిమా బడ్జెట్లు 70-80 కోట్ల దగ్గరలో ఆగేవి. కానీ ఇప్పుడు పరిస్థితిలో తేడా వచ్చేసింది.
స్టార్ హీరోలు బడ్జెట్ నే 100 కోట్లు దాటించేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న స్పైడర్ కు 120 కోట్లు లెక్క ఎప్పుడో దాటిపోయిందనే టాక్ ఉంది. అయితే.. మురుగదాస్ క్రేజ్ బేస్ చేసుకుని.. తమిళ్.. మలయాళం.. హిందీల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న భరత్ అను నేను మూవీ బడ్జెట్ ను కూడా సెంచరీ దాటించేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మహేష్-కొరటాల కాంబినేషన్ పై ఉండే క్రేజ్ కు తోడు.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ.. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ.. తమిళ్ యాక్టర్ శరత్ కుమార్.. ఇలా అందరికీ భారీ మొత్తాన్నే ముట్ట చెప్పేస్తున్నారట.
అయితే.. వీటన్నిటి కంటే ముఖ్యంగా స్పైడర్ తర్వాత మహేష్ బాబుకు తమిళంలో మినిమం 20 కోట్ల రూపాయల మార్కెట్ ఉంటుందనే పాయింట్ నిర్మాత డీవీవీ దానయ్యను కన్విన్స్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే 100 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు దానయ్య సై అనేశారట. భరత్ అను నేనులో మహేష్ బాబు సీఎంగా కనిపించనుండగా.. ప్రస్తుతం స్పైడర్ చివరి పాట కోసం రొమేనియాలో ఉన్న మహేష్.. అది పూర్తి చేసుకుని.. హైద్రాబాద్ రాగానే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.