Begin typing your search above and press return to search.

గోవాలో సేద తీరుతున్న 'స్పై'

By:  Tupaki Desk   |   11 May 2017 8:53 AM GMT
గోవాలో సేద తీరుతున్న స్పై
X
ఓ నెల రోజుల క్రితం నుంచి.. ఇంకో ఏడాది వరకు.. టాలీవుడ్ లో స్పై అన్నమాట వినిపించినా.. స్పైడర్ అనే పదం వినిపించినా.. మహేష్ బాబు గుర్తొచ్చేయడం ఖాయం. సూపర్ స్టార్ మరుసటి చిత్రానికి ఆ పేరు ఖాయం చేయడం మహత్యమే ఇదంతా. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. ఇంకా కొంత భాగం షూటింగ్ చేయాల్సి ఉంది.

ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ లేకపోవడంతో గోవా చేరుకున్నాడు మహేష్. తన ఫ్యామిలీతో కలిసి గోవాలో వాలిపోయిన సూపర్ స్టార్.. కొన్ని రోజుల పాటు ఇక్కడే గడపనున్నాడు. సమ్మర్ బ్రేక్ ని గోవాకు కేటాయించేందుకు ఫిక్స్ అయిపోయిన మహేష్ బాబు.. ఇది పూర్తయ్యాక స్పైడర్ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇప్పటివరకూ జూన్ 23న స్పైడర్ రిలీజ్ అవుతుందనే హోప్ ఉంది కానీ.. రీసెంట్ గా అభిమానుల్లోని ఆ ఆశలు అడుగంటిపోయాయి. ఇంకా కొన్ని పాటల షూటింగ్ చేయాల్సి ఉండడంతో పాటు.. కీలకమైన క్లైమాక్స్ విషయంలో కూడా మార్పు చేర్పులు జరుగుతున్నాయట.

మరోవైపు తెలుగు-తమిళ్ బై లింగ్యువల్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. ఇప్పుడు మలయాళం-హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఇప్పుడు వినిపిస్తున్న ఆగస్ట్ నాటికైనా స్పైడర్ థియేటర్లలోకి దిగుతాడా దిగడా అనే డౌట్ చాలామందికి వచ్చేస్తోంది. ఇదెప్పటికి పూర్తయ్యేనో.. కొరటాల ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలుపెట్టేనో అనుకుంటున్నారు ఫ్యాన్స్.