Begin typing your search above and press return to search.

మహేష్ బాబు 'AMB సినిమాస్' కు అంతర్జాతీయ గుర్తింపు..!

By:  Tupaki Desk   |   14 April 2021 4:59 PM GMT
మహేష్ బాబు AMB సినిమాస్ కు అంతర్జాతీయ గుర్తింపు..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏసియన్ సినిమాస్‌ వారి భాగస్వామ్యంతో హైదరాబాద్ సమీపంలోని గచ్చిబౌలిలో అధునాతన హంగులతో 'AMB సినిమాస్' పేరిట మల్టీప్లెక్స్‌ ను నిర్మించారు మహేష్. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ తో మొత్తం 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ ని ఏర్పాటు చేసారు. వీవీఐపీ లాంజ్ - పార్టీ జోన్ - స్పెషల్ కిడ్స్ జోన్ - లగ్జరీ సీటింగ్ తదితర సదుపాయాలతో ఏఎంబీ సినిమాస్‌ ప్రేక్షకులకు వరల్డ్ క్లాస్ అనుభూతిని అందిస్తోంది. ఈ నేపథ్యంలో 'AMB సినిమాస్' మల్టీప్లెక్స్ 'ఇనవేషన్ అవార్డ్స్-2021' లో గ్లోబల్ గుర్తింపును పొందినట్లు తెలుస్తోంది.

'ఇనవేషన్ అవార్డ్స్-2021' లో లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఏఎంబీ సినిమాస్ ఫైనలిస్టుగా ఎంపికైంది. ఎవి ఇంటిగ్రేషన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ వారు ఈ కేటగిరీలో భారతదేశం నుండి ఈ మల్టీప్లెక్స్ ని మాత్రమే సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా 'AMB సినిమాస్' బృందానికి అభినందనలు తెలియజేసింది. ''#Inavation Awards-2021 ఫైనలిస్ట్‌ గా ఎంపికైనందుకు AMB సినిమాస్ కి అభినందనలు! ఈ ప్రపంచ గుర్తింపును సాధించటానికి మా టీం చేసిన కృషిని చూసి చాలా గర్వపడుతున్నాను! అవార్డ్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నాను!!'' అని నమ్రత పోస్ట్ పెట్టారు.