Begin typing your search above and press return to search.

మొక్క నాటితేనే సూప‌ర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   30 July 2018 5:14 PM GMT
మొక్క నాటితేనే సూప‌ర్‌ స్టార్‌
X

కికి ఛాలెంజ్‌ లు కాదు.. ఇలాంటి నిర్మాణాత్మ‌క‌ ఛాలెంజ్‌ లు విస‌రాలి. పిచ్చి పీక్స్‌లో కాకుండా ఇలా హ‌రిత‌హారం ఛాలెంజ్‌ విసిరే ద‌మ్ముందా ఎవ‌రికైనా? తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రికి కేసీఆర్‌- కేటీఆర్ బృందం ఇలాంటి ఛాలెంజ్‌ లు విసురుతూ నిర్మాణాత్మ‌కంగా ప‌చ్చ‌ద‌నం పెంచే ప్లాన్ చేస్తున్నారు. తాజాగా రాచ‌కొండ కాప్ నుంచి మంత్రి కేటీఆర్ ఈఛాలెంజ్ స్వీక‌రించి అటుపై మ‌హేష్‌ని ఛాలెంజ్ చేశారు. దానిని స్వీక‌రించిన‌ మ‌హేష్‌ బేబి సితార - మాష్ట‌ర్ గౌత‌మ్‌ - వంశీ పైడిప‌ల్లికి త‌నవంతుగా ఛాలెంజ్ ను బదిలీ చేశారు.

ఇదిగో ఇలా సితార‌తో క‌లిసి మ‌హేష్ మొక్క‌లు నాటుతున్న దృశ్యం ఆక‌ట్టుకుంటోంది. ఒక మామిడి మొక్క‌ను ఇలా తండ్రి కూతుళ్లు నాటారు. మొక్క నాటి చుట్టూ మ‌ట్టితో కుండీ వేసి - దానికి నీళ్లు కూడా పోశారు ఆ ఇద్ద‌రూ. ఇక ఈ దృశ్యంలో క్యూట్ సితార మాటేమో గానీ - మ‌హేష్ కాలేజ్ బుల్లోడిని త‌ల‌పిస్తున్నాడు. అల్ట్రా మోడ్ర‌న్ హెయిర్‌ స్టైల్‌ - కండ‌లు పెంచి టైట్‌ పిట్ ష‌ర్ట్‌ తో అత‌డిని చూస్తుంటే ఎవ‌రికైనా మ‌తి చెడాల్సిందే. హ‌రిత‌హారం.. గోగ్రీన్ అంటూ ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేసే ఇలాంటి ఛాలెంజ్‌ ల్ని మ‌న సెల‌బ్రిటీలు మ‌రింత‌గా తీసుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.